వంటల ‘నుసి’ ప్రమాదమే!

కాలుష్యం విషయంలో వంటలను పెద్దగా పరిగణనలోకి తీసుకోం. కానీ గాలిలో కలిసే 10% నుసి పదార్థ (పార్టిక్యులేట్‌ మ్యాటర్‌) ఉద్గారాలకు వంటలే కారణం! వంటలు వండుతున్నప్పుడు పొగ రూపంలో కొన్ని సేంద్రియ రేణువులు వెలువడుతుంటాయి. ఇవి వెంటనే కనుమరుగవుతాయని, అక్కడ ఎక్కువసేపు ఉండవని అనుకుంటుంటాం.

Published : 25 May 2022 01:09 IST

కాలుష్యం విషయంలో వంటలను పెద్దగా పరిగణనలోకి తీసుకోం. కానీ గాలిలో కలిసే 10% నుసి పదార్థ (పార్టిక్యులేట్‌ మ్యాటర్‌) ఉద్గారాలకు వంటలే కారణం! వంటలు వండుతున్నప్పుడు పొగ రూపంలో కొన్ని సేంద్రియ రేణువులు వెలువడుతుంటాయి. ఇవి వెంటనే కనుమరుగవుతాయని, అక్కడ ఎక్కువసేపు ఉండవని అనుకుంటుంటాం. ఇది నిజం కాదని బర్మింగ్‌హామ్‌, బాత్‌ యూనివర్సిటీల పరిశోధకులు చెబుతున్నారు. వంట వండేటప్పుడు వెలువడే సేంద్రియ రేణువులు చాలా రోజుల వరకు గాలిలో తేలియాడుతూ ఉంటున్నట్టు గుర్తించారు. దీనికి కారణం కొవ్వు ఆమ్లాలతో ఏర్పడే సూక్ష్మమైన నిర్మాణాలేనని తేల్చారు. ఎలక్ట్రిక్‌ పొయ్యిల మీద వండే వంటల కన్నా గ్యాస్‌ పొయ్యిల మీద వంటలతో దాదాపు రెండు రెట్లు ఎక్కువగా 2.5 సైజు నుసి పదార్థం వెలువడుతున్నట్టు ఇంతకుముందు నిర్వహించిన అధ్యయనాలు పేర్కొంటున్నాయి. నైట్రోజన్‌ ఆక్సైడ్‌, నైట్రోజన్‌ డయాక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, ఫార్మల్‌డిహైడ్‌ వంటి కాలుష్య కారకాలూ వెలువడతాయి. ఇంట్లోంచి సరిగా బయటకు వెళ్లే ఏర్పాట్లు లేకపోతే ఇవి జబ్బులనూ తెచ్చిపెడతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని