తొలి పూర్తి దేశీయ అటానమస్ వాహనం
స్వయం చోదక (అటానమస్) వాహనాలనగానే చాలామంది అనుమానాలే వ్యక్తం చేస్తారు. మన ప్రమేయం లేకుండా పూర్తిగా టెక్నాలజీ సాయంతో నడిచే వీటితో ప్రమాదాలు జరుగుతాయని భావిస్తుంటారు.
స్వయం చోదక (అటానమస్) వాహనాలనగానే చాలామంది అనుమానాలే వ్యక్తం చేస్తారు. మన ప్రమేయం లేకుండా పూర్తిగా టెక్నాలజీ సాయంతో నడిచే వీటితో ప్రమాదాలు జరుగుతాయని భావిస్తుంటారు. నిజానికి డ్రైవర్ తప్పిదం, నిర్లక్ష్యం మూలంగానే 80% రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే బెంగళూరులోని మైనస్ జీరో అనే అంకురసంస్థ కొత్తరకం స్వయం చోదక వాహనాన్ని రూపొందించింది. దీని పేరు జెడ్‌పాడ్. మనదేశపు మొట్టమొదటి పూర్తి అటనమస్ వాహనంగా భావిస్తున్న ఇది నేచర్ ఇన్‌స్పయిర్డ్ కృత్రిమ మేధ (ఎన్‌ఐఏ), ట్రూ విజన్ అటనమీ (టీవీఏ) పరిజ్ఞానాల సాయంతో పనిచేస్తుంది. దీనికి స్టీరింగ్ ఉండదు. హై-రెజల్యూషన్ కెమెరాలనే ప్రధాన సెన్సరీ వ్యవస్థగా ఉపయోగించుకుంటుంది. వాహనం చుట్టుపక్కల ఉండే వాటిని ఈ కెమెరాలు ప్రత్యక్షంగా చిత్రీకరించి, కృత్రిమ మేధ వ్యవస్థకు పంపిస్తాయి. కృత్రిమ మేధ వీటిని విశ్లేషించి.. వాహనం దిశ, వేగం, అడ్డంకులను తప్పించుకోవటం వంటి వాటికి సంబంధించిన నిర్ణయాలను తీసుకుంటుంది. ఖరీదైన సెన్సరీ అర్రేల మీద ఆధారపడే స్వయం చోదక వాహనాల కన్నా కెమెరా ఆధారిత జెడ్‌పాడ్ మరింత తక్కువ ధరకు అందుబాటులో ఉంటుందని మైనస్ జీరో సంస్థ చెబుతోంది. ప్రస్తుతానికి దీన్ని పార్కులు, యూనివర్సిటీ, కార్పొరేట్ సంస్థల ప్రాంగణాల వంటి పరిమిత ప్రదేశాల వాడకానికే ఉద్దేశించారు. సంప్రదాయ కృత్రిమ మేధ మాదిరిగా కాకుండా జెడ్‌పాడ్‌లోని ఎన్‌ఏఐని మన మెదడు స్ఫూర్తితో రూపొందించారు. దీని అల్గారిథమ్ తక్కువ శక్తితోనే ప్రత్యక్షంగా సమాచారాన్ని విడమరచుకుంటుంది. గజిబిజి రోడ్డు పరిస్థితులను తేలికగా గ్రహిస్తుంది. ఇక టీవీఏ పరిజ్ఞానమేమో కెమెరాల సాయంతో వాహనం సురక్షితంగా, సాఫీగా కదిలేలా చేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TET Results: 27న టెట్ ఫలితాలు.. ఎన్నిగంటలకంటే?
-
PM Modi: అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలో మోదీ పర్యటన
-
IND vs AUS: షమి, శార్దూల్ ఇంటికి.. ఆసీస్తో మూడో వన్డేకు టీమ్ఇండియాలో 13 మందే
-
CM Kcr: సీఎం కేసీఆర్కు స్వల్ప అస్వస్థత
-
Social Look: శ్రీనిధి సెల్ఫీలు.. శ్రుతి హాసన్ హొయలు.. నుపుర్ ప్రమోషన్!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు