సూర్యుడి కిరీటం వేడి గుట్టు తెలిసింది!
సూర్యుడి ఉపరితలం కన్నా ఆవర్తన వలయమైన ‘కిరీటం’ (కొరోనా) ఎందుకు వేడిగా ఉంటుంది? ఇన్నాళ్లుగా ఇది చిక్కుముడిగానే మిగిలిపోయింది
సూర్యుడి ఉపరితలం కన్నా ఆవర్తన వలయమైన ‘కిరీటం’ (కొరోనా) ఎందుకు వేడిగా ఉంటుంది? ఇన్నాళ్లుగా ఇది చిక్కుముడిగానే మిగిలిపోయింది. దీని రహస్యాన్ని రాయల్ అబ్జర్వేటరీ ఆఫ్ బెల్జియం (ఆర్‌ఓబీ), కేయూ ఎల్విన్ అనే అంతర్జాతీయ పరిశోధక బృంద సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఛేదించారు. సూర్యుడి ఉపరితలం (ఫొటోస్ఫేర్) కన్నా కిరీటం సుమారు 200 రెట్లు అధిక ఉష్ణోగ్రత కలిగుంటుంది. వేడి జనించే కేంద్రం నుంచి దూరంగా పోతున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుందనే నియమానికిది విరుద్ధం. దీనికి కారణమేంటన్నది ఖగోళ శాస్త్రవేత్తలకు అంతుచిక్కకుండా బుర్రలకు పదును పెడుతూనే ఉంది. దీన్ని ‘కొరోనల్ హీటింగ్ ప్రాబ్లమ్’గా అభివర్ణిస్తున్నారు. ఈ రహస్యాన్ని అర్థం చేసుకునే దిశగా గొప్ప ముందడుగు పడింది. సూర్యుడి ఆవర్తన వలయం అయస్కాంత తరంగాలతో వేడెక్కటం దీనికి కారణం కావొచ్చని తేలింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన సోలార్ ఆర్బిటర్ అంతరిక్షనౌకలోని ఎక్స్‌ట్రీమ్ అల్ట్రావయొలెట్ ఇమేజర్ (ఈయూఐ) అందించిన సమాచారం ఈ ఆవిష్కరణకు మూలమైంది. ఆర్‌ఓబీ పర్యవేక్షణలో ఉన్న ఈ టెలిస్కోప్ సూర్యుడి కిరీటం దృశ్యాలను అత్యంత స్పష్టంగా చిత్రీకరించింది. అందువల్ల కిరీటంలోని అయస్కాంత నిర్మాణాల్లో అతి సూక్ష్మ తేడాలనూ గుర్తించటం సాధ్యమైంది. అధిక పౌనఃపున్యంతో కూడిన ఈ అయస్కాంత తరంగాలు సూర్యుడి వాతావరణం వేడెక్కటానికి దోహదం చేస్తుంటాయి. ఇందులో తక్కువ పౌనఃపున్య తరంగాల కన్నా అధిక పౌనఃపున్య తరంగాలు గణనీయమైన పాత్ర పోషిస్తున్నాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ డాయె లిమ్ చెబుతున్నారు. ఇది సూర్యుడి తీరుతెన్నులను, అవి సౌర వ్యవస్థ మీద చూపే ప్రభావాలను అవగతం చేసుకోవటానికి తోడ్పడగలవని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: 72అడుగుల ఎత్తైన దీన్‌దయాళ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
-
Delimitation: దక్షిణాది వాణిని అణచివేయాలని చూస్తే మౌనం వహించేది లేదు: కేటీఆర్
-
IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్
-
Vasu Varma: డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది నేను కాదు: ‘జోష్’ దర్శకుడు
-
RBI: ఆర్బీఐ కొరడా.. ఎస్బీఐ సహా 3 బ్యాంకులకు పెనాల్టీ
-
నెట్టింట్లో బాలికల నకిలీ నగ్న చిత్రాలు.. AI చిత్రాలపై స్పెయిన్ దిగ్భ్రాంతి