ఈజ్‌ ఈక్వల్‌ టు గుర్తు కథ

లెక్కల్లో ప్లస్‌, మైనస్‌, ఈక్వల్‌ వంటి గుర్తులను అలవోకగా వాడేస్తుంటాం. ప్రపంచంలో ఎక్కడైనా, ఎవరైనా లెక్కల్లోని అంశాలను తేలికగా అర్థం చేసుకోవటానికివి తోడ్పడతాయి.

Published : 25 Oct 2023 00:37 IST

లెక్కల్లో ప్లస్‌, మైనస్‌, ఈక్వల్‌ వంటి గుర్తులను అలవోకగా వాడేస్తుంటాం. ప్రపంచంలో ఎక్కడైనా, ఎవరైనా లెక్కల్లోని అంశాలను తేలికగా అర్థం చేసుకోవటానికివి తోడ్పడతాయి. అయితే ప్రతి గుర్తుకూ ఓ చరిత్ర ఉందని తెలుసా? ఇది ఆ కాలం నాటి గణితశాస్త్ర స్థితిని తెలియజేస్తుంది. లెక్కల్లో రెండు వైపుల మొత్తాలు సమానమే అని తెలియజేసే ‘ఈక్వల్‌’ గుర్తు చరిత్ర కూడా అలాంటిదే. దీన్ని వేల్స్‌ గణిత శాస్త్రవేత్త రాబర్ట్‌ రికార్డే 1557లో సృష్టించారు. ఆయన తన ‘ద వెట్‌స్టోన్‌ ఆఫ్‌ విటే’ అనే పుస్తకంలో రెండు అంకెల కూడికలకు సంబంధించి కొన్ని ఉదాహరణలు పేర్కొన్నారు. రెండు వైపులా సమాన మొత్తాలను పేర్కొనటానికి ప్రతిసారీ ‘ఈజ్‌ ఈక్వల్‌ టు’ అని అక్షరాల్లో రాయటం చాలా కష్టంగా అనిపించింది. దీనికి బదులు ఈక్వల్‌ గుర్తును వాడుతున్నానని పేర్కొన్నారు. చిత్రంగా మొదట్లో దీనికి ప్రాచుర్యం లభించలేదు. కొందరు గణితవేత్తలు సమానం కోసం రెండు నిలువు గీతలను వాడేవారు. ఇలా వేర్వేరు గుర్తులు బోలెడన్ని వచ్చాయి, పోయాయి. చివరికి 1600ల చివర్లో రాబర్ట్‌ రికార్డే సృష్టించిన అడ్డం రెండు గీతల గుర్తుకు ప్రాచుర్యం లభించింది. అంటే దీనికి ఆదరణ లభించటానికి చాలా ఏళ్లే పట్టిందన్నమాట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని