Android 13 (Go Edition): ఆండ్రాయిడ్ 13 ఫీచర్లతో ‘గో ఎడిషన్‌’.. ప్రత్యేకతలివే!

ఎంట్రీ లెవల్‌ ఫోన్లలో కూడా ఓఎస్‌ సులువుగా అప్‌డేట్ అయ్యేందుకు వీలుగా ఆండ్రాయిడ్ గో ఎడిషన్‌ తాజా అప్‌డేట్‌లో కొత్త ఫీచర్‌ను గూగుల్ పరిచయం చేయనుంది. ఇంతకీ, గో ఎడిషన్‌ లేటెస్ట్ అప్‌డేట్‌లో రాబోయే ఆ ఫీచర్‌ ఏంటి? ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

Published : 27 Oct 2022 10:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంట్రీ లెవల్, బడ్జెట్‌ ఫోన్ల కోసం గూగుల్ ఆండ్రాయిడ్ (Android) లైట్‌ వెర్షన్‌ ఓఎస్‌ ‘గో ఎడిషన్‌’ను ఇస్తోంది. తాజాగా ఈ ఓఎస్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ ‘ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్‌’ (Android 13 Go Edition) అప్‌డేట్‌ను గూగుల్ విడుదల చేయనుంది. ఇందులో యూజర్లకు అందుబాటులోకి రాబోయే ఫీచర్లపై ఓ లుక్కేద్దాం. 

  • గత గో ఎడిషన్‌ ఓఎస్‌లకు భిన్నంగా కొత్త అప్‌డేట్‌లో గూగుల్ ప్లే సిస్టమ్‌ అప్‌డేట్స్‌ (Google Play System Updates)ను ఇస్తోంది. దీనివల్ల గో ఎడిషన్‌తో పనిచేస్తున్న డివైజ్‌లు కూడా సాధారణ ఆండ్రాయిడ్‌తో పనిచేస్తున్న మొబైల్స్‌ మాదిరి ముఖ్యమైన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు పొందుతాయి. 
  • గో ఎడిషన్‌లో కూడా సాధారణ ఆండ్రాయిడ్ 13లో ఉన్న ఫీచర్లనే ఇస్తున్నారు. వీటిలో నోటిఫికేషన్‌ పర్మిషన్స్‌, యాప్‌ లాంగ్వేజ్‌ ప్రిఫరెన్సెస్‌, మెటీరియల్‌ యూ ఉన్నాయి. 

  • మెటీరియల్‌ యూ ఫీచర్‌తో వాల్‌పేపర్‌లోని కలర్‌కు అనుగుణంగా ఫోన్ లోపలి కలర్‌ స్కీమ్‌ను మార్చుకోవచ్చు. సాధారణ ఆండ్రాయిడ్‌ 13లో ఈ ఫీచర్‌తో యూజర్‌ తనకు నచ్చిన కలర్‌ను ఎంచుకోవచ్చు. కానీ, గో ఎడిషన్‌లో కేవలం నాలుగు కలర్‌ ఆప్షన్లు మాత్రమే ఇస్తున్నారు. 
  • లాంగ్వేజ్‌ ప్రిఫరెన్సెస్‌తో యూజర్‌ యాప్‌ల భాషను తనకు అర్థమయ్యే భాషలోకి మార్చుకోవచ్చు. ఉదాహరణకు ఆంగ్లం భాషలో ఉన్న యాప్‌కు తెలుగు భాషను ఇంటర్‌ఫేస్‌ లాంగ్వేజ్‌గా సెట్ చేసుకోవచ్చు. 
  • యూజర్‌ ప్రైవసీ కోసం నోటిఫికేషన్‌ పర్మిషన్స్‌ ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. కొత్తగా ఏదైనా యాప్‌ డౌన్‌లోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన నోటిఫికేషన్లు పంపాలంటే ఇకపై యూజర్‌ అనుమతి తప్పనిసరి. దీనివల్ల విసుగుపుట్టించే నోటిఫికేషన్లకు చెక్ పెట్టేయొచ్చు. 
  • ఇవి కాకుండా డిస్కవర్‌ హోమ్‌ స్క్రీన్‌ అనే ఫీచర్‌తో యూజర్‌  హోమ్‌ స్క్రీన్‌పై కుడివైపుకు స్వైప్‌ చేస్తే సాధారణ ఆండ్రాయిడ్‌లో మాదిరి వీడియోలు, ఆర్టికల్స్‌కు సంబంధించిన సూచనలు కనిపిస్తాయి. 
  • ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్‌ సపోర్ట్ చేసే డివైజ్‌లకు సంబంధించి గూగుల్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. టెక్‌వర్గాల సమాచారం ప్రకారం ఈ ఓఎస్‌ శాంసంగ్ గెలాక్సీ ఎమ్‌13 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఏ10 సిరీస్‌, శాంసంగ్ గెలాక్సీ ఏ03 కోర్‌, వివో వై సిరీస్‌, నోకియా సీ21తోపాటు కొన్ని రెడ్‌మీ ఫోన్లను సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు