Hisense Laser TV: 120 అంగుళాల స్క్రీన్‌తో హిసెన్స్‌ లేజర్‌ టీవీ.. ధరెంతో తెలుసా?

హిసెన్స్‌ కంపెనీ లేజర్‌ టీవీని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. హిసెన్స్‌ 4కే స్మార్ట్‌ లేజర్‌ టీవీ 120ఎల్‌9జీ పేరుతో తీసుకొస్తున్న ఈ టీవీలో 3000 లుమినస్‌ బ్రైట్‌నెస్‌, 4కే అల్ట్రాహెచ్‌డీ పిక్షర్‌ క్వాలిటీతో 120 అంగులాల డిస్‌ప్లే ఇస్తున్నారు...

Published : 09 Jul 2022 00:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంట్లోనే థియేటర్‌ అనుభూతిని ఆస్వాదించేలా పెద్ద స్క్రీన్‌, అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో స్మార్ట్‌ టీవీలను తీసుకొస్తున్నాయి పలు కంపెనీలు. తాజాగా హిసెన్స్‌ కంపెనీ లేజర్‌ టీవీని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. హిసెన్స్‌ 4కే స్మార్ట్‌ లేజర్‌ టీవీ 120ఎల్‌9జీ (Hisense 4K Smart Laser TV 120L9G) పేరుతో తీసుకొస్తున్న ఈ టీవీలో 3000 లుమినస్‌ బ్రైట్‌నెస్‌, 4కే అల్ట్రా హెచ్‌డీ పిక్షర్‌ క్వాలిటీతో 120 అంగుళాల డిస్‌ప్లే ఇస్తున్నారు. 40వాట్‌ డాల్బీ అట్‌మోస్ సౌండ్‌ ఫీచర్‌ ఉంది. ఇందులోని అడ్వాన్స్‌ టెక్నాలజీ యూజర్లకు టీవీ వీక్షణలో సరికొత్త అనుభూతిని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ టీవీలో అమెజాన్‌ అలెక్సా బిల్ట్‌-ఇన్‌ ఫీచర్‌గా వస్తోంది. దీంతో యూజర్లు ఇంట్లోని ఐవోటీ డివైజ్‌లకు టీవీని సులువుగా కనెన్ట్ చేయడంతోపాటు, తమకు కావాల్సిన ఓటీటీ కంటెంట్‌ను యాక్సెస్ చేయొచ్చు. ఇవేకాకుండా వైడ్‌ కలర్‌, స్పోర్ట్స్‌ కోసం స్మూత్ మోషన్‌, ఫిల్మ్‌మేకర్‌ మోడ్‌, టీయూవీ బ్లూ లైట్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

హిసెన్స్‌ 120 అంగుళాల లేజర్‌ టీవీలో ప్రపంచంలోనే తొలిసారిగా ట్రిపుల్ కలర్‌ టెక్నాలజీని ఉపయోగించారు. ప్యూర్‌ రెడ్‌, గ్రీన్‌, బ్లూ లేజర్స్‌తో టీవీలో కలర్స్‌ మరింత మెరుగ్గా కనిపిస్తాయని కంపెనీ చెబుతోంది. టీవీ చూసేప్పుడు కళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రాక్సిమిటీ సెన్సార్‌ ఇస్తున్నారు. యూజర్లు టీవీ స్క్రీన్‌కు దగ్గరగా వచ్చినప్పుడు లేజర్‌ లైట్‌ సోర్స్‌ బ్రైట్‌నెస్‌ను తగ్గించి కళ్లకు రక్షణ కల్పిస్తుంది. భారత మార్కెట్లో హిసెన్స్‌ లేజర్‌ టీవీ ధర ₹ 4,99,999గా ఉంది. అమెజాన్‌ నుంచి కొనుగోలు చేయొచ్చు. మూడు సంవత్సరాల వారెంటీతోపాటు పరిమితకాల ఆఫర్ కింద అమెజాన్‌ 4కే ఫైర్‌ టీవీ స్టిక్‌ మ్యాక్స్‌ ఉచితంగా లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని