ANC Earbuds: నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఇయర్‌బడ్స్‌.. బడ్జెట్‌ నుంచి ప్రీమియం మోడల్స్‌!

ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ (టీడబ్ల్యూఎస్‌) మోడల్స్‌లో నాయిస్‌ క్యాన్సిలేషన్ ఫీచర్‌ ఉన్న కొన్ని ఇయర్‌బడ్స్‌ జాబితా మీ కోసం...

Published : 05 Aug 2022 13:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ (టీడబ్ల్యూఎస్‌).. వైర్డ్‌ ఇయర్‌ ఫోన్స్‌కు ప్రత్యామ్నాయంగా, ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు వీలుగా డిజైన్ చేశారు. వీటిలో ఎన్నో మోడల్స్‌ మార్కెట్లో ఉన్నప్పటికీ, కొన్ని మాత్రమే స్పష్టమైన ఆడియోను అందించగలవు. సాధారణ బడ్స్‌తో మ్యూజిక్‌ వింటున్నప్పుడు బయటి నుంచి వచ్చే శబ్దాలు చిరాకు తెప్పిస్తుంటాయి. అలా బయటి శబ్దాలు వినిపించకుండా, స్పష్టమైన ఆడియో కావాలంటే నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ ఉండాలి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బడ్స్‌లో నాయిస్‌ క్యాన్సిలేషన్ ఫీచర్‌ ఉన్న కొన్ని మోడల్స్‌ జాబితా మీ కోసం...


వన్‌ప్లస్‌ బడ్స్‌ జెడ్‌2 (OnePlus Buds Z2)

డాల్బీఅట్‌మోస్‌ సౌండింగ్‌తో 40 డెసిబిల్‌ యాక్టివ్‌నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఉంది. వీటిని పది నిమిషాలు ఛార్జ్‌ చేస్తే ఐదు గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. ఇయర్‌బడ్స్‌లో 40 ఎంఏహెచ్ బ్యాటరీ, ఛార్జింగ్‌ కేస్‌లో 520 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి. ఛార్జింగ్‌కేస్‌తో ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే 38 గంటలు పనిచేస్తాయని వన్‌ప్లస్ చెబుతోంది. గేమింగ్‌కు 94 ఎమ్‌ఎస్‌ అల్ట్రా-లో లాటెన్సీ, ఫోన్‌ కాలింగ్ కోసం మూడు మైక్‌లు ఉన్నాయి. బడ్స్‌కు ఐపీ55 వాటర్‌ అండ్ స్వెట్ రెసిస్టెంట్, ఛార్జింగ్‌ కేస్‌కు ఐపీఎక్స్‌ 4 రెసిస్టెంట్ రేటింగ్ ఉంది. ఈ బడ్స్‌ ధర ₹ 4,999. 


రియల్‌మీ బడ్స్‌ ఎయిర్‌2 (realme Buds Air2)

25 డెసిబిల్‌ నాయిస్ క్యాన్సిలేషన్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్‌ కోసం రియల్‌మీ ఆర్‌2 చిప్‌ను ఉపయోగించింది. ఇది తక్కువ పవర్‌ను ఉపయోగిస్తూ, చిన్న శబ్దాలను కూడా అడ్డుకుంటుందని రియల్‌మీ చెబుతోంది. వీటిలో స్మార్ట్‌ వేర్‌ డిటెక్షన్‌ ఫీచర్‌ ఉంది. ఇది యూజర్‌ బడ్స్‌ను చెవి నుంచి తీసిన వెంటనే ప్లేబ్యాక్‌ను ఆటోమేటిగ్గా పాజ్‌ చేసి ట్రాన్సపరెన్సీ మోడ్‌లోకి మారుస్తుంది. పది నిమిషాలు ఛార్జింగ్‌తో రెండు గంటలపాటు పనిచేస్తాయి. వంద శాతం ఛార్జింగ్‌తో 25 గంటల ప్లేబ్యాక్‌ టైమ్‌ను ఇస్తాయని కంపెనీ చెబుతోంది. వీటి ధర ₹ 2,999.  


నథింగ్ ఇయర్‌ వన్‌ (Nothing ear 1)

నథింగ్ ఇయర్‌ 1లో యాక్టివ్ నాయిస్‌ క్యాన్సిలేషన్ ఫీచర్‌తోపాటు మూడు హై డెఫినిషన్ మైక్‌లు ఉన్నాయి. నాయిస్‌ క్యాన్సిలేషన్ తీవ్రతను ఇయర్ 1 యాప్‌ ద్వారా సర్దుబాటు చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్‌కి ఈ యాప్ అందుబాటులో ఉంది. ఇయర్‌బడ్స్‌ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 5.7 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. ఛార్జింగ్‌ కేస్‌తో 34 గంటలపాటు బ్యాటరీ స్టాండ్‌బైలో ఉంటుంది. వీటిని పది నిమిషాలు ఛార్జ్ చేస్తే 8 గంటలపాటు మ్యూజిక్‌ని ఆస్వాదించవచ్చని నథింగ్ తెలిపింది. వీటి ధర ₹ 5,999. 


సోనీ డబ్ల్యూఎఫ్‌-1000 ఎక్స్‌ఎమ్‌3 (Sony WF-1000XM3)

నాయిస్‌ క్యాన్సిలేషన్‌ కోసం వీటిలో సోనీ హెచ్‌డీ నాయిస్‌ క్యాన్సిలింగ్‌ క్యూఎన్‌1ఈ ప్రాసెసర్‌, డ్యూయల్‌ నాయిస్‌ సెన్సర్‌ టెక్నాలజీ ఉపయోగించారు. సింగిల్‌ ఛార్జ్‌తో 24 గంటలు నిరంతరాయంగా పనిచేస్తాయి. పది నిమిషాలు ఛార్జ్‌ చేస్తే గంటన్నర ప్లేటైమ్‌ను అందిస్తుందని సోనీ చెబుతోంది. ఇందులోని అడాప్టివ్‌ సౌండ్‌ కంట్రోల్‌, యూజర్‌ కదలికల ఆధారంగా నాయిస్‌ క్యాన్సిలేషన్‌, సౌండ్‌ను కంట్రోల్‌ చేస్తుంది. భారత మార్కెట్లో ఈ బడ్స్‌ ధర ₹ 19,990.  


శాంసంగ్ గెలాక్సీ బడ్స్‌2 (Samsung Galaxy Buds2)

వీటిలోని యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ 98 శాతం కచ్చితత్వంతో పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. మ్యూజిక్‌ ప్రియుల కోసం ఆరు ఈక్వలైజర్స్‌ ఉన్నాయి. బడ్స్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఈక్వలైజర్‌ ఆప్షన్‌లో నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌తో ఐదు గంటలు, ఛార్జింగ్ కేస్‌తో ఛార్జ్‌ చేస్తే 20 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తాయని శాంసంగ్ చెబుతోంది. ఫోన్‌కాల్స్‌ కోసం మూడు మైక్రోఫోన్స్‌తోపాటు వాయిస్‌ పికప్‌ యూనిట్ ఉంది. ఈ బడ్స్‌ ధర ₹ 11,999. 


యాపిల్ ఎయిర్‌పాడ్స్‌ ప్రో (Apple Airpods Pro)

ట్రాన్సపరెన్సీ మోడ్‌, యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్లు ఉన్నాయి. వీటితో బయటి శబ్దాలను పూర్తిగా నిరోధించి యూజర్‌కు మెరుగైన ఆడియోను అందిస్తాయి. హెచ్‌1 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. స్వెట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ ఉంది. మెగాసేఫ్‌ ఛార్జింగ్ కేస్‌తో ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 24 గంటలు, 5 నిమిషాల ఛార్జింగ్‌ టైమ్‌తో గంటపాటు పనిచేస్తాయి. ఛార్జింగ్ అవసరమైనప్పుడు యూజర్‌ ఫోన్‌కు లోబ్యాటరీ అని నోటిఫికేషన్‌ను పంపుతాయి. వీటి ధర ₹ 26,300. 


 వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ సీఈ (OnePlus Nord Buds CE)

నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌తో వన్‌ప్లస్‌ కంపెనీ అందిస్తున్న మరో మోడల్‌. ఇందులో 13.4 ఎమ్‌ఎమ్‌ డైనమిక్ డ్రైవర్స్‌ ఉన్నాయి. నాలుగు ఈక్వలైజర్స్‌ ఇస్తున్నారు. హేయ్‌ మెలోడి యాప్‌ ద్వారా వీటిలో నచ్చినదాన్ని యూజర్‌ ఎంచుకోవచ్చు. సింగిల్‌ ఛార్జ్‌తో 20 గంటలపాటు పనిచేస్తాయి. పదినిమిషాల ఛార్జింగ్‌తో గంట 20 నిమిషాలపాటు పనిచేస్తాయి. వీటి ధర ₹ 2,299. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని