తక్కువ ధరకే 5జీ ఫోన్‌.. ఎప్పుడంటే..!

5జీ స్మార్ట్‌ఫోన్‌..గతేడాది దీనిపైనే సుదీర్ఘ చర్చ నడించింది. భారత్‌లో ఈ నెట్‌వర్క్‌ అందుబాటులోకి రానప్పటికీ మొబైల్ తయారీ కంపెనీలు పరిమిత సంఖ్యలో 5జీ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. వాటి ధర ఎక్కువ కావడంతో అమ్మకాల్లో నిరాశపరచాయి.... 

Published : 05 Jan 2021 22:47 IST

ఇంటర్నెట్ డెస్క్‌: 5జీ స్మార్ట్‌ఫోన్‌.. గతేడాది దీనిపైనే సుదీర్ఘ చర్చ నడిచింది. భారత్‌లో ఈ నెట్‌వర్క్‌ అందుబాటులోకి రానప్పటికీ మొబైల్ తయారీ కంపెనీలు పరిమిత సంఖ్యలో 5జీ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. వాటి ధర ఎక్కువ కావడంతో అమ్మకాలు నిరాశపరిచాయి. 5జీ ఫోన్‌లో ఉపయోగించే ప్రాసెసర్‌ ధరలు ఎక్కువగా ఉండటం దీనికి ప్రధాన కారణం. దీంతో ప్రాసెసర్‌ తయారీ కంపెనీ క్వాల్‌కోమ్‌ తక్కువ ధరకే స్నాప్‌డ్రాగన్‌ 4 సిరీస్‌లో 5జీ నెట్‌వర్క్‌ని సపోర్ట్ చేసే ప్రాసెసర్‌ని తీసుకొస్తున్నట్లు గతేడాది చివర్లో ప్రకటించింది. తాజాగా తొలి బడ్జెట్‌ 5జీ ప్రాసెసర్‌ స్నాప్‌డ్రాగన్‌ 480 పేరుతో విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీని వల్ల మొబైల్ తయారీ కంపెనీలు తక్కువ ధరకే 5జీ ఫోన్లను వినియోగదారులకు అందివ్వగలవని క్వాల్‌కోమ్ అభిప్రాయపడింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మొబైల్‌ నెట్‌వర్క్‌లో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని వెల్లడించింది.

గతంలో క్వాల్‌కోమ్ విడుదల చేసిన స్నాప్‌డ్రాగన్‌ 460 కంటే స్నాప్‌డ్రాగన్‌ 480 ప్రాసెసర్‌ యూజర్స్‌కి మెరుగైన పనితీరును అందిస్తుందట. ఇది క్విక్‌ ఛార్జ్ 4 ప్లస్‌, 120ఎఫ్‌పీఎస్‌ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ప్యానల్స్‌, 64ఎంపీ కెమెరాలను సపోర్ట్ చేస్తుందని తెలిపింది. స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌తో 5జీ మొబైల్స్‌ని అందించేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని ఒప్పో కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ తొలి త్రైమాసికంలోనే స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌తో బడ్జెట్ 5జీ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని మార్కెట్ వర్గాల అంచనా. ఇప్పటికే మోటోరోలా కొత్తగా తీసుకొస్తున్న ఇబిజా ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 400 సిరీస్‌ ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు