Smartphones under ₹10k: రూ.పదివేలలోపు ఉన్న బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే!
సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని సరసమైన ధరలో పలు కంపెనీలు ఇప్పటికే కొన్ని ఫోన్లను విడుదల చేశాయి. మరి పదివేల లోపు అందుబాటులో ఉన్న స్మార్ట్ఫోన్లు ఏవి?
ఇంటర్నెట్ డెస్క్: తక్కువ బడ్జెట్లో అన్నీ ఫీచర్లు ఉన్న స్మార్ట్ఫోన్ల కోసం చాలా మంది వెతుకుతుంటారు. ఈ నేపథ్యంలో సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని సరసమైన ధరలో పలు కంపెనీలు ఇప్పటికే కొన్ని ఫోన్లను విడుదల చేశాయి. మరి పదివేల లోపు అందుబాటులో ఉన్న స్మార్ట్ఫోన్లు ఏవి? వాటి ఫీచర్లపై ఓ లుక్కేద్దాం..
జియో నెక్స్ట్ (JioPhone Next)
భారతీయ టెలికాం దిగ్గజం జియో సంస్థ గూగుల్‌తో కలిసి జియో ఫోన్ నెక్స్ట్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. సరసమైన ధరలో 4జీ సౌలభ్యం, ప్రీమియం ఫీచర్లతో ఈ మొబైల్‌ను అభివృద్ధి చేసింది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 215 క్యూఎమ్ ప్రాసెసర్‌ను వాడారు. వెనకాల 13 ఎంపీ, ముందు 8 ఎంపీ ఆటో ఫోకస్ కెమెరాలు అమర్చారు. 5.45 అంగుళాల హెచ్డీ డిస్ప్లేతో.. 2జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజీకి మద్దతిస్తుంది. పైగా మెమొరీని 512జీబీ వరకు విస్తరించుకోవచ్చు. 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ పనిచేస్తుంది. జియోఫోన్ నెక్స్ట్ ధర రూ.6,499గా కంపెనీ నిర్ణయించింది.
శాంసంగ్ గెలాక్సీ ఏ03 (Samsung Galaxy A03)
శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్‌లో ఏ03 మోడల్ కూడా ధర పదివేల లోపు ఉన్న జాబితాలో ఉంది. దీని వెనుకభాగంలో 48ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు డెప్త్ సెన్సర్‌తో 2ఎంపీ కెమెరాను అమర్చారు. ఆక్టా కోర్ 1.6 గిగాహెడ్జ్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఈ ఫోన్ ధర రూ.7,999గా ఉంది.
టెక్నో స్పార్క్ 8 ప్రో (Tecno Spark 8 Pro price)
పదివేల లోపు ఉన్న ఫోన్ల జాబితాలో టెక్నో స్పార్క్ 8 ప్రో కూడా ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో 6.8 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లేను ఇచ్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో 33 వాట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తోంది. దీని ముందు భాగంలో 8ఎంపీ కెమెరాను అమర్చారు. వెనుక భాగంలో 48 ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సర్‌ను ఇచ్చారు. దీని ధర రూ.9,999గా ఉంది.
రియల్మీ నార్జో 50ఐ (Realme Narzo 50i)
రియల్మీ కంపెనీ నార్జో సిరీస్‌లో విడుదల చేసిన 50ఐ మోడల్ కూడా ఈ జాబితాలో ఉంది. దీన్ని కంపెనీ గతేడాది సెప్టెంబరులోనే విడుదల చేసింది. ఇందులో ఆక్టాకోర్ యూనిసాక్ 9863 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6.5 అంగుళాల ఎల్సీడీ మల్టీ టచ్ డిస్ప్లే ఇచ్చారు. వెనుకవైపు 8 ఎంపీ ఏఐ కెమెరా ఉంది. ముందు భాగంలో 5 ఎంపీ ఏఐ సెల్ఫీ కెమెరాను అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 2జీబీ ర్యామ్/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,499, 4జీబీ/64జీబీ వేరియంట్ ధర రూ. 8,999గా నిర్ణయించారు.
రెడ్మీ 9 (Redmi 9)
రెడ్మీ 9 పేరుతో కొత్త మోడల్‌ను రెడ్మీ గతంలోనే విడుదల చేసింది. 6.53 అంగుళాల హెచ్డీ డిస్ప్లేను ఇచ్చారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ఎస్ఓసీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో వెనకవైపు 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, డెప్త్ సెన్సర్‌తో 2 ఎంపీ కెమెరాను అమర్చారు. ముందు సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తున్నారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 4జీబీ/64జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 8,999గా సంస్థ నిర్ణయించింది.
పోకో సీ31 (Poco C31)
బడ్జెట్ ధరలో పోకో బ్రాండ్ నుంచి పోకో సీ31 ఈ లిస్ట్‌లో ఉంది. 6.53 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌ను వాడారు. అంతర్గత మెమొరీని 512జీబీ వరకు పెంచుకునే వీలుంది. వెనుక వైపు 13 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు రెండు 2ఎంపీ కెమెరాలు అమర్చారు. సెల్ఫీల కోసం 5ఎంపీ కెమెరాను ఇచ్చారు. ఇందులోని 5000 ఎంఏహెచ్ బ్యాటరీ రెండు రోజుల పాటు బ్యాకప్ ఇస్తుంది. 3జీబీ+32జీబీ వేరియంట్ ధరను కంపెనీ రూ.8,499గా నిర్ణయించింది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్12
పదివేలలోపు ఉన్న ఫోన్లలో శాంసంగ్ నుంచి మరో ఫోన్ గెలాక్సీ ఎఫ్12 కూడా ఉంది. ఇందులో ఆక్టాకోర్ 850 ప్రాసెసర్‌ను వాడారు. 90హెర్జ్ రిఫ్రెష్‌రేట్‌తో 6.5 హెచ్డీ డిస్ప్లే ఇచ్చారు. వెనకవైపు 48ఎంపీ ప్రధాన కెమెరా, 5ఎంపీ ఆల్ట్రా వైడ్ సెన్సర్, 2ఎంపీ డెప్త్ కెమెరా, 2ఎంపీ మ్యాక్రో కెమెరా ఇచ్చారు. ముందువైపు 8ఎంపీ కెమెరాను అమర్చారు. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఈ ఫోన్ ధర రూ.9,499గా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెబ్క్యామే స్కానర్
డెస్క్‌టాప్ ఉంది గానీ స్కానర్ లేదా? పోనీ వెబ్‌క్యామ్ అయినా ఉందా? అయితే దీన్నే స్కానర్‌లా వాడుకుంటే సరి. మ్యాక్‌లోనైతే- ఫొటో బూత్‌ను ఓపెన్ చేసి, డాక్యుమెంట్‌ను వెబ్‌క్యామ్ ముందుకు తీసుకురావాలి. -
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు. -
పిక్సెల్ ఫోన్లలో లుకప్ ఫీచర్
గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడేవారికి శుభవార్త. తెలియని నంబర్ల నుంచి కాల్ చేసే వారిని గుర్తించే లుకప్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీన్ని ఇంతకుముందు జపాన్‌లో పరిచయం చేశారు గానీ ఇతర ప్రాంతాల్లో విడుదల చేయలేదు. -
మొబైల్ రోబో
వినూత్న ఫీచర్లతో కూడిన కొత్త టూల్స్‌తో టెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. అలాంటి టూల్ ఒకటి ఇటీవలే విడుదలైంది. దీని పేరు ఎల్ఓఓఐ. ఇదో చిన్న డెస్క్‌టాప్ రోబో. -
మిమిక్రీ ఇంజిన్!
ప్రముఖ కృత్రిమ మేధ కంపెనీ ఓపెన్ఏఐ తాజాగా వాయిస్ అసిస్టెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా వాయిస్ ఇంజిన్ అనే వినూత్న టూల్‌ను పరిచయం చేసింది. -
కొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
ఐఫోన్ కిటుకులు
ఐఫోన్లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్‌కు అప్డేట్ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు. -
ఫొటో కటౌట్ చిటికెలో
ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్ చేయటం పెద్ద పని. అడోబ్ ఫొటోషాప్, ఏఐ టూల్స్ వంటి అధునాతన సాధనాలు అవసరం. -
సెల్ సర్వీసు మొరాయిస్తే?
ఎప్పుడైనా సెల్‌ఫోన్ సర్వీసు సరిగా పనిచేయకపోతే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టి, కాసేపు వేచి చూడాలి. తర్వాత ఫోన్‌ను యథాస్థితికి తేవాలి. దీంతో ఫోన్ సమీపంలోని సెల్ టవర్‌తో కనెక్ట్ అవుతుంది -
పాస్వర్డ్ మేనేజర్ భద్రమేనా?
భద్రత, బ్యాకప్ టూల్స్‌గా పాస్వర్డ్ మేనేజర్స్ ఉపయోగపడతాయి. వీటితో పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్‌వర్డ్‌ను టైప్ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది. -
ఐఫోన్‌కు మరింత భద్రత
యాపిల్ సంస్థ ఐఓఎస్ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. పేరుకు తగ్గట్టుగానే ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. -
ఇక మొబైల్ ఫోనే టీవీ
రేడియో, ఫోన్లలోని రిసీవర్ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్ ఫోన్లో యూట్యూబ్‌లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం. -
పాత ప్రింటర్‌ను అమ్ముతున్నారా?
ప్రింటర్‌తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. -
నచ్చిన ఫొటోల స్లైడ్‌షో
ఇష్టమైన ఫొటోలను స్లైడ్ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్లో వేయాలి. -
ఫొటో అసలుదేనా?
ఆన్లైన్లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా. -
కీబోర్డు మీద వేళ్ల ప్రయాణం!
కీబోర్డు మీద చకచకా టైప్ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు. -
వినూత్నం మృదు రోబో
ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్ రింగ్‌బాట్స్‌ను రూపొందించి సంచలనం సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్‌తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్‌పై మీమ్స్.. విరాట్‌పై సోడా బాటిల్ జోక్స్