బేబీ హెయిర్‌ దాచేద్దాం!

పెళ్లిళ్లు, మెహందీ, సంగీత్‌ అంటూ వేడుకలు జరుగుతూనే ఉంటున్నాయి కదా! అందంగా కనిపించడానికి రకరకాల హెయిర్‌ స్టైల్స్‌ వేస్తుంటాం. కానీ బేబీ హెయిర్‌ ఉంటే మాత్రం మాటిమాటికీ¨ జుట్టు చెదిరి ఇబ్బంది పెడుతుంది. ఇది కనిపించకుండా అందంగా దాచేద్దామిలా... నచ్చిన హెయిర్‌స్టైల్‌ వేసుకున్నాక  పాత టూత్‌బ్రష్‌ లేదా మస్కారా బ్రష్‌ తీసుకుని చిన్నచిన్న వెంట్రుకలు కనిపించే చోట వీటిని ఉపయోగించి నెమ్మదిగా దువ్వితే అవి లోపలికి వెళ్లిపోతాయి.

Published : 29 Apr 2024 02:22 IST

పెళ్లిళ్లు, మెహందీ, సంగీత్‌ అంటూ వేడుకలు జరుగుతూనే ఉంటున్నాయి కదా! అందంగా కనిపించడానికి రకరకాల హెయిర్‌ స్టైల్స్‌ వేస్తుంటాం. కానీ బేబీ హెయిర్‌ ఉంటే మాత్రం మాటిమాటికీ¨ జుట్టు చెదిరి ఇబ్బంది పెడుతుంది. ఇది కనిపించకుండా అందంగా దాచేద్దామిలా...

చ్చిన హెయిర్‌స్టైల్‌ వేసుకున్నాక  పాత టూత్‌బ్రష్‌ లేదా మస్కారా బ్రష్‌ తీసుకుని చిన్నచిన్న వెంట్రుకలు కనిపించే చోట వీటిని ఉపయోగించి నెమ్మదిగా దువ్వితే అవి లోపలికి వెళ్లిపోతాయి. దువ్వేముందు బ్రష్‌ని తడిపితే మీ పని ఇంకా తేలిక అవుతుంది.

  • వాతావరణ కాలుష్యం, ఎండ వంటి వాటివల్ల జుట్టు పొడిగామారి ఇబ్బంది పెడుతుంది. దీనికి తోడు తలస్నానం చేసిన వెంటనే హెయిర్‌ డ్రైయర్లు పెడుతుంటాం. వీటివల్ల కూడా జుట్టు పొడిగా అయ్యి బేబీహెయిర్‌ ముందుకొస్తుంది. ఇలాకాకుండా ఉండాలంటే గాఢత తక్కువ ఉండే హెయిర్‌స్ప్రేలు, కొబ్బరినూనె, జిడ్డుతక్కువ నూనెలను ఎంపిక చేసుకోవాలి. హెయిర్‌ డ్రైయర్‌ను ఉపయోగిస్తే తక్కువ ఉష్ణోగ్రత వద్ద పెట్టి చేసుకోవాలి.
  • ఈ జాగ్రత్తలన్నీ పాటించలేం మావల్ల కాదంటారా..! తలను పట్టి ఉండే హెయిర్‌ క్లిప్‌లు, బ్యాండ్లు, మిస్సీబన్‌, మిస్సీపోని వంటి కొత్తరకం హెయిర్‌స్టైల్స్‌ను ఎంచుకోండి.. బేబీ హెయిర్‌ విసిగించదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్