షాంపూ చేసే ముందు... సహజ చికిత్స

వాతావరణ కాలుష్యం మన కురులపై చూపే దుష్ప్రభావమెంతో! దానికితోడు రసాయనాలు ఎక్కువ ఉండే షాంపూలను వాడితే జుట్టు మరింత పాడవుతుంది. మరేం చేద్దామంటారా? తలస్నానానికి ముందు ఈ చికిత్సలు ప్రయత్నిస్తే సరి.

Published : 01 May 2024 02:05 IST

వాతావరణ కాలుష్యం మన కురులపై చూపే దుష్ప్రభావమెంతో! దానికితోడు రసాయనాలు ఎక్కువ ఉండే షాంపూలను వాడితే జుట్టు మరింత పాడవుతుంది. మరేం చేద్దామంటారా? తలస్నానానికి ముందు ఈ చికిత్సలు ప్రయత్నిస్తే సరి.

  •  కప్పు నీటిలో కొన్ని వేపాకులు, 10-15 తులసి ఆకులు వేసి మరిగించాలి. గోరువెచ్చగా అయ్యాక నీటిని వడకట్టి పక్కన ఉంచాలి. ఆకులను మిక్సీ పట్టి, ఆ మిశ్రమంతోపాటు 3 స్పూన్ల కలబంద గుజ్జును ఆ నీటికి కలపాలి. ఆపై మాడు నుంచి కురుల వరకు దీన్ని పట్టించి, పావుగంటయ్యాక తలస్నానం చేస్తే సరి. ఇది తలపై ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంతోపాటు కురులు చిట్లడాన్నీ నివారిస్తాయి.
  • శీకాయ, ఉసిరి ప్యాక్‌ కూడా కురులకు దివ్యౌషధం. అయితే దీని తయారీకి రెండు రోజులు కేటాయించాలి మరి. ఒక ఇనుప కడాయి తీసుకొని సమపాళ్లలో రెండు పొడులనూ తీసుకొని నీటిలో నానబెట్టాలి. రెండోరోజు మాడు, కురులకు పట్టించి, మృదువుగా రుద్దాలి. పావుగంట అయ్యాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేసి చూడండి. మెరిసే కురులు సొంతమవుతాయి. ఇవి చుండ్రునీ నివారిస్తాయి.
  •  ముల్తానీ మట్టి మోముకి చేసే మేలెంతో మనకు తెలుసు. మాడునీ ఆరోగ్యంగా ఉంచుతుందని తెలుసా? రెండు స్పూన్ల ముల్తానీ మట్టికి మజ్జిగను కలిపి మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. అయిదు నిమిషాలు పక్కన పెట్టి, తర్వాత తలకు రాసుకోవాలి. ఆరాక చల్లని నీటితో తలస్నానం చేయాలి. జుట్టు బరకగా, పొడిబారుతున్నట్లు కనిపిస్తోంటే దీన్ని ప్రయత్నించండి. వాటికి తేమను అందించి, మృదువుగా చేయడమే కాదు... తలపై చెమట కారణంగా ఏర్పడే దురద, దద్దుర్లనూ తగ్గిస్తుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్