చిరుత అందం... అందుకుందామా?

‘ఫ్యాషన్‌ ప్రపంచమంతా ఒక వృత్తంలో తిరుగుతుంది... అలనాటి అందాలే కొత్త రూపుదాల్చుకుని తిరిగొస్తాయి’ అన్నది అందరి మాట. అది ఏ విషయంలోనైనా సరే కానీ... లెపర్డ్‌ ప్రింట్‌ విషయంలో మాత్రం కాదు అంటారు ఫ్యాషనిస్టులు.

Published : 03 May 2024 01:45 IST

‘ఫ్యాషన్‌ ప్రపంచమంతా ఒక వృత్తంలో తిరుగుతుంది... అలనాటి అందాలే కొత్త రూపుదాల్చుకుని తిరిగొస్తాయి’ అన్నది అందరి మాట. అది ఏ విషయంలోనైనా సరే కానీ... లెపర్డ్‌ ప్రింట్‌ విషయంలో మాత్రం కాదు అంటారు ఫ్యాషనిస్టులు. అదెప్పుడూ ట్రెండ్‌లో భాగమే... కాస్త కనుమరుగైనా తిరిగి అంతే అందంగా దూసుకొస్తుంది అంటారు వాళ్లు.

అవును మరి... ఈనాటిదా ఈ ఫ్యాషన్‌. చిరుత పులి చర్మాన్ని పోలినట్టుండే ఈ ఫ్యాషన్‌ 1940ల్లో తొలిసారి హాలీవుడ్‌ తెరమీదకి వచ్చింది. అక్కడి నుంచి ప్రపంచమంతా ప్రయాణించింది. ‘డేరింగ్‌ స్టైల్‌’ అంటూ ఇప్పటికీ ఈ ట్రెండ్‌పై మనసు పారేసుకుంటున్నారంతా. అంతెందుకు, మొన్నటికి మొన్న హాలీవుడ్‌ తారలు అలా రెడ్‌ కార్పెట్‌ మీద మెరిపించారో లేదో... మన డిజైనర్ల చేతికీ పని వచ్చింది. అందుకే ఫ్యాషన్‌ వీక్‌ల్లో తెగ సందడి చేస్తోంది.

లావు, సన్నం, మధ్యస్థం... శరీరాకృతి ఏదైనా నప్పేయడం ఈ ప్రింట్‌ ప్రత్యేకం. కాబట్టే మన తారలూ పార్టీలైనా, హాలిడే టూర్లైనా ‘లేడీ చిరుత’ల్లా సిద్ధమై అందరి దృష్టీ ఆకర్షించేస్తున్నారు. అలా 2024 ప్రపంచవ్యాప్త ట్రెండింగ్‌ దుస్తుల్లో లెపర్డ్‌ ప్రింట్‌ సింహ భాగాన్ని ఆక్రమించేసింది. అంతలా అలరిస్తున్న ఫ్యాషన్‌... అమ్మాయిల దృష్టిని ఎలా దాటిపోతుంది చెప్పండి? అందుకే వారికి తగ్గట్టుగా స్కర్ట్స్‌, జాకెట్స్‌, ఫ్రాక్స్‌, టాప్స్‌, చీరలు... అన్ని రకాల్లోనూ ఫ్యాషన్‌ డిజైనర్లు ఈ ప్రింట్‌ని తీసుకొచ్చారు.

కాటన్‌, జార్జెట్‌, సిల్క్‌... నచ్చిన వస్త్రరకంలో ఎంచుకునే వీలూ కల్పిస్తున్నారు. కాలేజ్‌, ఆఫీసు, పార్టీ, విహారం... సందర్భానికి తగు దుస్తులు సిద్ధంగా ఉన్నాయి. ఫ్యాషన్‌పై అవగాహన, రంగుల ఎంపికపై కాస్త దృష్టిపెడితే చాలు... మీరూ లెపర్డ్‌ లేడీ అవొచ్చు. ప్రయత్నిస్తారా మరి?

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్