పడుచుకి... పచ్చటి గుత్తుల హారం!

నగలపై మక్కువ లేని మగువలుండరంటే అతిశయోక్తి కాదేమో! అందుకే వారి మనసుని పసిగట్టి... పసిడి మెరుపులకు ముత్యాలు, పచ్చలు, పగడాలు... వంటి నవరత్నాలెన్నో చేర్చి చమక్కుమనిపిస్తుంటారు డిజైనర్లు.

Published : 30 Apr 2024 01:53 IST

నగలపై మక్కువ లేని మగువలుండరంటే అతిశయోక్తి కాదేమో! అందుకే వారి మనసుని పసిగట్టి... పసిడి మెరుపులకు ముత్యాలు, పచ్చలు, పగడాలు... వంటి నవరత్నాలెన్నో చేర్చి చమక్కుమనిపిస్తుంటారు డిజైనర్లు. అంతేనా, అమ్మ, అమ్మమ్మల తరం నాటి ఆభరణాలకు, అందమైన నగిషీలెన్నో అద్ది ఈతరం వారిని ఆకట్టుకుంటున్నారు. అలా వచ్చినవే గుత్తపూసల హారాలు. ఇవి నిన్నటి వరకూ ముత్యాలతో మురిపించాయి. ఇప్పుడు పచ్చలు, సెమీ ప్రెషయస్‌ ఆనిక్స్‌ స్టోన్‌తో... సందడి చేస్తున్నాయి. రాణీహారాలు, చోకర్లు, టెంపుల్‌ డిజైన్‌ నగల హారాలు... ఒకటేమిటి అన్నింటి మీదకూ చేరి ధరించినవారికో ప్రత్యేకతనూ తెచ్చిపెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రాచరికానికి గుర్తుగా రాజ్యమేలే పచ్చలు... ఇప్పుడు రకరకాల ఆకృతుల్లో ఒదిగిపోతున్నాయి. ముఖ్యంగా ముత్యాలను పోలి ఉండేలా చేసిన ఇవి చిన్న చిన్న గుత్తుల్లో ఒదిగిపోయి హుందాగా మెప్పిస్తున్నాయి. పుత్తడి నగిషీల మధ్య కొత్తదనాన్ని చుట్టుకుని అదరహో అనిపిస్తున్నాయి. ముత్యాలతోనూ జతకట్టి సొగసులీనుతున్నాయి. మరింకెందుకాలస్యం రానున్న వేడుకలూ, పండగల్లో చీరకు జతగా ధరించేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్