గుడ్డు పెంకులతో అందం..!

ప్రొటీన్లు, విటమిన్‌-బి ఎక్కువగా ఉండే గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే దాని పెంకుల్లోనూ చర్మానికి మేలు చేసే గుణాలు దాగి ఉన్నాయి. ఇవి ముఖంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి, మృదువుగా మారుస్తాయి.

Published : 03 May 2024 01:59 IST

ప్రొటీన్లు, విటమిన్‌-బి ఎక్కువగా ఉండే గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే దాని పెంకుల్లోనూ చర్మానికి మేలు చేసే గుణాలు దాగి ఉన్నాయి. ఇవి ముఖంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి, మృదువుగా మారుస్తాయి. మొటిమలు, మచ్చలను తగ్గిస్తాయి. అదెలా అంటే..

కొన్ని గుడ్డు పెంకుల్ని తీసుకుని బాగా కడిగి ఆరబెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో కొద్దిగా కోడిగుడ్డు తెల్లసొనను కలిపి మెత్తని పేస్టు చేసుకోవాలి. ముఖానికి పట్టించి ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ముఖ చర్మానికి ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేసి చర్మానికి కావాల్సిన తేమను అందిస్తుంది. వారానికి మూడుసార్లు చేస్తే చర్మానికి సహజ మెరుపు లభిస్తుంది.

  • చర్మంపై మంట, దురద, దద్దుర్లు వంటివి ఉంటే గుడ్డు పెంకుల పొడికి చెంచా ఆపిల్‌ సెడార్‌ వినెగర్‌ వేసి ఐదురోజులు నాననివ్వాలి. తరవాత ఈ మిశ్రమంలో దూదిని ముంచి సమస్య ఉన్నచోట రాసి, ఆరాక చల్లటి నీటితో కడిగితే సరి. ఆపిల్‌ సెడార్‌ వినెగర్‌లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలు చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. వారానికి మూడుసార్లు చేస్తే సమస్య నయం అవుతుంది.
  • చిన్న వయసులోనే కొంతమంది చర్మంపై ముడతలు కనిపిస్తుంటాయి. వీటిని తగ్గించాలంటే చెంచా గుడ్డుపెంకుల పొడి, మూడు చుక్కల రోజ్‌మెరీ వాటర్‌, గుడ్డులోని తెల్లసొన వేసి బాగా గిలకొట్టాలి. ఇందులో పావుచెంచా చొప్పున తేనె, పాలు కలిపి ముఖానికి పట్టించాలి. పావుగంటాగి గోరువెచ్చని నీటితో కడిగితే ఫలితం ఉంటుంది.
  • గుడ్డు పెంకుల పొడితో రోజూ మీ దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. ఇందులో ఉండే కాల్షియం, ఇతర ఖనిజాలు దంతాలపై ఉండే ఎనామిల్‌ పొరను కాపాడతాయి. శుభ్రంచేసి మెరిపిస్తాయి.
  • చర్మంపై ఉండే మృతకణాలను తొలగించి, తేమను అందించడానికి చెంచా గుడ్డు పెంకుల పొడిలో రెండుచెంచాల పంచదార, చెంచా తేనె కలిపి కాసేపు స్క్రబ్‌ చేయాలి. ఆరాక చల్లటి నీటితో కడిగితే సరి. ఇలా వారానికోసారి చేస్తే చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్