మంత్రముగ్ధుల్ని చేసేస్తున్నాయి...

సాధారణంగా జ్యుయెలరీ, యాక్సెసరీలను ఉన్నవి ఉన్నట్లుగా వాడుతుంటాం. కానీ వాటికీ కొత్తహంగులను జోడించి నయా లుక్‌ కావాలనుకుంటోంది ఈతరం. అందుకే తయారీదారులు మార్కెట్లోకి రకరకాల డిజైన్లలో అలంకరణలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

Published : 27 Apr 2024 01:13 IST

సాధారణంగా జ్యుయెలరీ, యాక్సెసరీలను ఉన్నవి ఉన్నట్లుగా వాడుతుంటాం. కానీ వాటికీ కొత్తహంగులను జోడించి నయా లుక్‌ కావాలనుకుంటోంది ఈతరం. అందుకే తయారీదారులు మార్కెట్లోకి రకరకాల డిజైన్లలో అలంకరణలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వాటిలో కొన్ని ఇవి...


‘వాచ్‌’ చేయండి..

వాచ్‌ను సమయం చూసుకునే సాధనంగా కంటే ఫ్యాషన్‌ సింబల్‌గానే పరిగణిస్తోంది ఈతరం. అందుకే అవీ అందంగా, స్టైలిష్‌గా ఉండాలనుకుంటున్నారు. చిన్న చైన్‌కు చిట్టి చిట్టి దేవుని ప్రతిమలు, నక్షత్రాలు, పూల వంటి రకరకాల పెండెంట్‌లు అమర్చి ఉన్న చైన్లను తగిలించేస్తున్నారు. పూసలు, రాళ్లతో కూడిన ఈ సన్నని స్ట్రిప్స్‌ వాచ్‌లకు అదనపు హంగులద్దుతున్నాయి.


చలా‘కీ’గా...

తాళం చెవిని చేతిలో పట్టుకునేది కాసేపైనా సరే... అదీ చూడడానికి అందంగా, ముచ్చటగా ఉండాలి కదా! అందుకే మినియేచర్‌ బొమ్మలు, పూసలు, అక్షరాలతో జతచేసి ఉన్న కీచైన్‌లను ఎంచుకుంటున్నారిప్పుడు. మీకూ నచ్చాయా!  


బ్యాగుకూ అందం...

బయటకు వెళ్లినప్పుడు ముందుగా అందరి దృష్టిని ఆకర్షించేది చేతిలోని బ్యాగే. మరి అది బోసిగా ఉంటే ఏం బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పటి అమ్మాయిలు. చూడముచ్చటైన ఈ చార్మ్స్‌ని బ్యాగుకి జతచేస్తున్నారు. అందులోనూ కొంచెం సృజనాత్మకత జోడించాలనుకున్న వాళ్లైతే మినియేచర్‌ బుక్స్‌, బొమ్మలున్నవీ ఎంచుకుంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్