Maldives: డ్రాగన్‌తో మాల్దీవుల బంధం.. ఆ దేశాన్ని పట్టించుకోని భారతీయులు

మాల్దీవుల(Maldives) అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు తన చర్యలతో భారత్‌కు దూరం అవుతున్నారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లే మన పర్యటకుల సంఖ్య తగ్గుతోంది.

Published : 09 Mar 2024 15:12 IST

మాలె: భారత్‌తో దౌత్యపరమైన వివాదం వేళ.. మాల్దీవుల(Maldives)కు వెళ్లే పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఆ దేశ పర్యటక ర్యాంకింగ్‌లో మన దేశం ఆరో స్థానానికి చేరుకుంది. అక్కడి ప్రభుత్వ గణాంకాల ప్రకారం..

గతేడాది డిసెంబరు 31 వరకు భారత్‌ నుంచి 2,09,198 మంది పర్యటకులు మాల్దీవుల(Maldives)ను సందర్శించారు. నాడు ద్వీపదేశ పర్యటక మార్కెట్‌లో 11 శాతం వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. రష్యా రెండో స్థానంలో.. చైనా మూడో స్థానంలో కొనసాగాయి. నాలుగో స్థానంలో బ్రిటన్‌ నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో లక్షద్వీప్‌ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ.. సాహసాలు చేయాలనుకున్నవారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. తర్వాత కూడా ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు డ్రాగన్‌కు దగ్గరవుతూ, భారత్‌పై నోరు పారేసుకుంటున్నారు.

‘భారత ప్రజలారా క్షమించండి’: దౌత్యవివాదంపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు

ఈ వివాదంతో మాల్దీవుల(Maldives)కు వెళ్లే మన పర్యటకుల సంఖ్య పడిపోతోంది. జనవరి ప్రారంభంలో మోదీ పర్యటన తర్వాత.. మూడు వారాల్లో (జనవరి 21) అగ్రస్థానంలో ఉన్న భారత్‌ ఐదో స్థానానికి దిగొచ్చింది. 28 వేల మంది పర్యటకులతో(6.3శాతం) మార్చి 3 నాటికి ఆరో స్థానానికి పడిపోయింది. ఆ దేశ పర్యటక మార్కెట్‌లో 12 శాతం వాటాతో చైనా మొదటి స్థానంలో నిలిచింది. రష్యా(9.8శాతం), ఇటలీ(9.6 శాతం), యూకే(9.0శాతం), జర్మనీ(6.5శాతం) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని