AP Inter Marks Revaluation: ఇంటర్‌ ఫిజిక్స్‌లో ఫెయిల్‌.. రీవెరిఫికేషన్‌లో 59 మార్కులు

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనంలో వింతలు వెలుగుచూస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన గౌతమి అనే అమ్మాయికి భౌతికశాస్త్రం-2 విషయంలో ఇలా జరిగింది.

Updated : 17 May 2023 08:05 IST

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనంలో వింతలు వెలుగుచూస్తున్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన గౌతమి అనే అమ్మాయికి భౌతికశాస్త్రం-2 విషయంలో ఇలా జరిగింది. దీంతో మానసిక ఆందోళనకు గురైన అమ్మాయి రీవెరిఫికేషన్‌, జవాబు పత్రం కోసం దరఖాస్తు చేసింది. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ఫలితాలను ఇంటర్‌ విద్యామండలి మంగళవారం విడుదల చేయడంతో అసలు విషయం బయటపడింది. రీవెరిఫికేషన్‌లో 60 మార్కులకు గానూ 59 వచ్చాయి. బోర్డు అధికారుల తప్పిదంతో ఈ అమ్మాయి ఎంతో మానసిక వ్యథకు గురైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని