Tim Cook: యాపిల్‌ సీఈఓను ఆకట్టుకున్న ‘ఆపేక్ష’ దీపావళి ఫొటో

ముంబయివాసి తీసిన ఓ దీపావళి చిత్రం యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ను ఆకట్టుకుంది. దాన్ని ట్విటర్‌లో షేర్‌ చేసిన ఆయన అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

Updated : 25 Oct 2022 08:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముంబయికి చెందిన ఆపేక్షా మకర్‌ అనే ఫొటోగ్రాఫర్‌ తీసిన ఫొటో ఒకటి యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ను ఆకట్టుకుంది. తన ట్విటర్‌ వేదికగా ఆ చిత్రాన్ని పంచుకున్న ఆయన అద్భుతంగా ఉందంటూ ఆపేక్షను అభినందించారు. ‘‘దీపావళిని వెలుగుల పండుగ అని ఎందుకు పిలుస్తారో ఈ చిత్రం అందంగా వివరిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అందమైన అలంకరణ మధ్య ఓ దీపాన్ని వెలిగించి, దాన్ని చేత్తో రక్షిస్తున్నట్లుగా ఉన్న ఆ దృశ్యాన్ని ఐఫోన్‌తో క్లిక్‌మనిపించారు. కుక్‌ ట్వీట్‌ను స్క్రీన్‌షాట్‌ తీసిన ఆపేక్ష దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకున్నారు. తన చిత్రాన్ని టిమ్‌ కుక్‌ ప్రశంసించడంపై సంతోషం వ్యక్తం చేశారు.  కృతజ్ఞతలు తెలిపారు. ఆమె కూడా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇన్‌స్టా బయో ప్రకారం.. ఆపేక్ష ఒక ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌. కియారా అడ్వాణీ, దీపికా పదుకొణె, అనుష్క శర్మ వంటి ప్రముఖులతో పాటు టాప్‌ బ్రాండ్లతో ఆమె పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని