BOB FD Rates: బీఓబీ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్ల పెంపు!

BOB FD Rates: ఆర్‌బీఐ రెపోరేటు పెంచుతున్న నేపథ్యంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా డిపాజిట్‌ రేట్లను పెంచింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్లు పెంచింది.

Updated : 19 Mar 2023 18:40 IST

దిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank of Baroda) తమ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. రిటైల్‌ టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. రూ.రెండు కోట్లు అంతకంటే తక్కువ డిపాజిట్లకు కొత్త రేట్లు వర్తిస్తాయని తెలిపింది. 2023 మార్చి 17 నుంచే వీటిని వర్తింపజేయనున్నట్లు పేర్కొంది.

‘బరోడా ట్యాక్స్‌ సేవింగ్స్‌ టర్మ్‌ డిపాజిట్‌’, ‘బరోడా అడ్వాంటేజ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌’ వంటి ప్రత్యేక డిపాజిట్లకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. వీటిని మధ్యలో ఉపసంహరించుకోవడానికి వీలుండదు. పెంపు తర్వాత మూడేళ్ల ఒకరోజు నుంచి ఐదేళ్ల వరకు టర్మ్‌ డిపాజిట్లపై వడ్డీరేటు 6.5 శాతానికి చేరింది. సీనియర్‌ సిటిజన్లకు ఇది 7.15 శాతంగా ఉంది. ఐదేళ్ల ఒకరోజు నుంచి పదేళ్ల కాలావధి గల డిపాజిట్లపై కూడా వడ్డీరేటు 6.5 శాతానికి చేరింది. సీనియర్‌ సిటిజన్లకు మాత్రం ఇది 7.5 శాతంగా ఉండనుంది. చివరిసారి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2022 డిసెంబరులో వడ్డీరేట్లను 65 బేసిస్‌ పాయింట్లు పెంచింది. నవంబరులోనూ 100 బేసిస్‌ పాయింట్లు పెంచడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని