Retirement plan: పదవీ విరమణ కోసం మదుపు చేస్తున్నారా? ఇవి చూడండి..
పదవీ విరమణ, పెన్షన్ కోసం ఎలాంటి పధకాలను ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: జీవితంలో అత్యంత కీలకమైన దశల్లో పదవీ విరమణ ఒకటి. అందుకే ఎవరైనా తమ పదవీ విరమణ అనంతరం సౌకర్యంగా జీవించడానికి కావల్సిన నిధిని తమ కెరీర్ ప్రారంభం నుంచే సమకూర్చడం ప్రారంభిస్తుంటారు. మీరు ఎంత త్వరగా ప్రారంభిస్తే, పదవీ విరమణ తర్వాత అంత ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. ఒకవేళ పదవీ విరమణ అనంతర నిధి కోసం చూస్తుంటే మీకు NPS, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF) లాంటివి అందుబాటులో ఉన్నాయి. పదవీ విరమణ కార్పస్‌ను సమకూర్చుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. వీటి ఫీచర్స్‌ను ఇక్కడ చూద్దాం..
ఖాతాను తెరిచే వయసు..
NPS: 18-70 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తి NPS టైర్-1 ఖాతాను తెరవవచ్చు.
PPF: ఈ ఖాతాను ఏ వయసులోనైనా తెరవవచ్చు. కానీ, 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తికి.. అతడి సంరక్షకుడు ఖాతా తెరవాలి.
VPF: ఉద్యోగంలో చేరిన వారందరికీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) తప్పనిసరి. ఇందులో మరికాస్త మదుపు చేయాలనుకునే వారికోసమే వీపీఎఫ్.
పెట్టుబడి కాలం
NPS: కనీస పెట్టుబడి కాలం 3 సంవత్సరాలు (60 ఏళ్ల తర్వాత NPSలో చేరిన వారికి మాత్రమే), గరిష్ఠ పెట్టుబడి కాలం 57 సంవత్సరాలు.
PPF: పెట్టుబడి వ్యవధి 15 సంవత్సరాలు, దీన్ని 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 5 సంవత్సరాల చొప్పున ఎనిసార్లయినా పొడిగించవచ్చు.
VPF: ఉద్యోగం కొనసాగినంత కాలం ఈ ఫండ్‌లో డబ్బులు జమచేయొచ్చు.
నిష్ర్కమించే వయసు
NPS: సాధారణ నిష్క్రమణ వయసు 60 సంవత్సరాలు, గరిష్ఠ/ పొడిగించిన నిష్క్రమణ వయసు 75 సంవత్సరాలు.
PPF: ఒక వ్యక్తి 15 సంవత్సరాలు పూర్తయిన తర్వాత PPF నుంచి నిష్క్రమించొచ్చు. లేదా ఎన్నిసార్లైనా 5 సంవత్సరాల చొప్పున పొడిగించుకుని స్కీమ్‌లో కొనసాగవచ్చు. కాబట్టి, నిష్క్రమణ వయసు ప్రవేశ వయసుపై ఆధారపడి ఉంటుంది. అయితే, మైనర్లకు, కనీస నిష్క్రమణ వయసు 18 సంవత్సరాలు.
VPF: రిటైర్‌మెంట్ వయసు వరకు కొనసాగి అనంతరం నిష్క్రమించొచ్చు.
పెట్టుబడుల స్వభావం
NPS: ఇది వివిధ పెట్టుబడి నిధి ఎంపికలను కలిగి ఉన్న పథకం. ఇందులో మదుపుదారులు వారి రిస్క్ పరిమితి, వయసును బట్టి కావాల్సిన పెట్టుబడి ఆప్షన్ ఎంచుకోవచ్చు.
PPF: ఇది ఎలాంటి మార్కెట్ లింక్ లేని స్థిర-రాబడి పెట్టుబడి ఎంపిక.
VPF: ఇది కూడా స్థిరమైన రాబడినే ఇస్తుంది.
పెట్టుబడి పరిమితులు
NPS: టైర్-1 ఖాతాలో కనీస వార్షిక సహకారం ఆర్థిక సంవత్సరంలో రూ.500, స్వచ్ఛంద చందాపై గరిష్ఠ పరిమితి లేదు.
PPF: దీనిలో ప్రస్తుత కనీస వార్షిక పెట్టుబడి రూ.500, ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.1.5- లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.
VPF: గరిష్ఠంగా 12% వరకు యాజమాన్యం ఈపీఎఫ్‌కు చెల్లిస్తుంది. అయితే, వీపీఎఫ్ అనేది స్వచ్ఛందం కాబట్టి, జీతంలో (బేసిక్+ డీఏపై) 12-100% వరకు పెట్టుబడి పెట్టొచ్చు. అంటే, ఈపీఎఫ్+వీపీఎఫ్‌లో ఏడాదికి గరిష్ఠంగా రూ.2.50 లక్షల దాకా పెట్టుబడి పెట్టొచ్చు.
పన్ను ప్రయోజనాలు
NPS: టైర్-1 ఖాతాలలోని చందాలు ఆదాయపు పన్ను చట్టంలోని 80సి పరిమితి (ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షలు) మేరకు పన్ను మినహాయింపునకు అర్హత ఉంటుంది. అదనంగా రూ.50,000 వరకు 80సిసిడి (1బి) కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. 60 సంవత్సరాల తర్వాత పొందిన మెచ్యూరిటీ మొత్తం పన్ను రహితం. అయితే, పెన్షన్ (యాన్యుటీ) మొత్తాన్ని పెట్టుబడిదారుని పన్ను విధించదగిన ఆదాయానికి జోడిస్తారు.
PPF: ఇందులో పెట్టిన పెట్టుబడి ఆదాయపు పన్ను చట్టంలోని 80సి ప్రకారం రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపునకు అర్హత ఉంటుంది. మెచ్యూరిటీ విలువ కూడా పూర్తిగా పన్ను రహితం.
VPF: ఇందులో పెట్టిన పెట్టుబడికి రూ.1.50 లక్షల వరకు 80సి కింద పన్ను ప్రయోజనముంటుంది. మెచ్యూరిటీ మొత్తం పన్ను రహితం.
మెచ్యూరిటీ వినియోగం
NPS: పదవీ విరమణ నిధిలో 60 శాతం వరకు, 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసులో ఒకేసారి తీసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని ఏదైనా ఐఆర్‌డీఏ-నియంత్రిత బీమా కంపెనీ నుంచి యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి ఉపయోగించాల్సి ఉంటుంది.
PPF: మెచ్యూరిటీ సమయంలో మొత్తం నిధిని ఉపసంహరించుకోవచ్చు.
VPF: మెచ్యూరిటీ సమయంలో మొత్తం నిధిని ఉపసంహరించుకోవచ్చు.
మెచ్యూరిటీకి ముందు పెట్టుబడిదారుడు మరణిస్తే?
NPS: క్లెయిమ్ తేదీకి ఉన్నటువంటి ఫండ్ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తుంది.
PPF: క్లెయిమ్ తేదీకి ఖాతాలో ఉన్నటువంటి అసలు, వడ్డీ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తుంది.
VPF: ఫండ్ మొత్తాన్ని(వడ్డీతో సహా) నామినీకి చెల్లిస్తారు.
ఛార్జీలు
NPS: దీనిలో ఫండ్ నిర్వహణకు వివిధ ఛార్జీలు ఉంటాయి. అటువంటి ఛార్జీలలో PRA (పర్మినెంట్ రిటైర్‌మెంట్ అకౌంట్) ప్రారంభ ఛార్జీ, ఈ ఖాతాకు వార్షిక నిర్వహణ ఖర్చు, ప్రారంభ సబ్‌స్క్రయిబర్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఖాతా ఓపెనింగ్, తదుపరి కంట్రిబ్యూషన్ ఛార్జీలు, అసెట్ సర్వీసింగ్ చార్జీలు, పెట్టుబడి నిర్వహణ రుసుము, నిష్క్రమణ/ ఉపసంహరణ కోసం ప్రాసెసింగ్ ఫీజు మొదలైనవి ఉంటాయి. మిగతా అన్ని(పెట్టుబడి+పెన్షన్) పథకాలతో పోలిస్తే ఎన్పీఎస్ లో ఛార్జీలు చాలా తక్కువనే చెప్పాలి.
PPF: ఈ ఖాతాపై ప్రత్యేక ఛార్జీలు విధించరు.
VPF: దీనిపై కూడా ఎటువంటి ప్రత్యేక ఛార్జీలూ ఉండవు.
చివరిగా: NPSలో కొంత మొత్తాన్ని యాన్యుటీల ద్వారా పెన్షన్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టి నెల నెలా పెన్షన్‌ను పొందొచ్చు. ఇది తప్పనిసరి కూడా. కానీ PPF, VPFలో ఏక మొత్తాన్ని మెచ్యూరిటీ సమయంలో తీసుకోవాలి. ప్రతి నెలా పెన్షన్‌లా తీసుకోవడానికి ఆప్షన్ లేదు. కాబట్టి, ఇలాంటి మొత్తాన్ని పీఎం వయ వందన యోజన, బ్యాంకుల ఎఫ్‌డీలు, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టి ప్రతి నెలా పెన్షన్ పొందొచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Koppula Eshwar: హజ్ యాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు.. జూన్ 5 నుంచి చార్టర్డ్ విమానాలు: మంత్రి కొప్పుల
-
World News
Voting: ఆ గ్రామం ఘనత.. 30 సెకన్లలో ఓటింగ్ పూర్తి
-
Crime News
Road Accident: ఘోరం.. కారును ఢీకొన్న బస్సు.. ఒకే కుటుంబంలో 10 మంది మృతి
-
General News
Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Priyanka Chopra: ప్రియాంక కారణంగా షూట్ వాయిదా.. 20 ఏళ్ల తర్వాత వెల్లడించిన బీటౌన్ నిర్మాత
-
India News
Kejriwal: ఎల్జీ సర్.. దిల్లీలో శాంతిభద్రతల బాధ్యత మీదే.. ఏదైనా చేయండి! : కేజ్రీవాల్