BSNL నుంచి ఐపీటీవీ సర్వీసులు.. బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌తో వెయ్యికి పైగా టీవీ ఛానెళ్లు

ఏపీలోని BSNL బ్రాడ్‌ బ్యాండ్‌ సబ్‌స్క్రైబర్ల కోసం ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ టెలివిజన్‌ (IPTV) సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. దీని ద్వారా వెయ్యికి పైగా ఛానెళ్లు వీక్షించొచ్చు.

Published : 24 Jan 2023 01:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) తమ బ్రాడ్‌ బ్యాండ్‌ సబ్‌స్క్రైబర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ టెలివిజన్‌ (IPTV) సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. సిటీ ఆన్‌లైన్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలసి ఈ సర్వీసులను తీసుకొచ్చినట్టు పేర్కొంది. ఉల్కా టీవీ (Ulka TV) పేరుతో తీసుకొస్తున్న ఈ సర్వీసులను ఇటీవల విజయవాడలో ప్రారంభించారు. త్వరలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లు వెయ్యికి పైగా టీవీ ఛానెళ్లను వీక్షించే సదుపాయం పొందనున్నారు.

బ్రాడ్‌బ్యాండ్‌, టీవీ కోసం ప్రత్యేకంగా రెండు వేర్వేరు కనెక్షన్లతో పనిలేకుండా ఒకే కనెక్షన్‌తో నాణ్యమైన వీడియో సర్వీసులను పొందటానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఐపీటీవీ సర్వీసులను తీసుకొచ్చింది. కొత్త లేదా ప్రస్తుతం ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కస్టమర్లు ఐపీటీవీ సర్వీసులను పొందొచ్చు. ఉల్కా టీవీ పేరుతో తెస్తున్న ఈ సేవలు టీవీతో పాటు స్మార్ట్‌ఫోన్లలో సైతం పొందొచ్చని బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లు రూ.399 నుంచి ప్రారంభమవుతాయి. 30 ఎంబీపీఎస్‌ స్పీడ్‌ వస్తుంది. మరోవైపు రైల్‌టెల్‌కు చెందిన రైల్‌వైర్‌ సంస్థ సిటీ ఆన్‌లైన్‌ మీడియాతో కలిసి ఐపీటీవీ సేవలను ప్రారంభించింది. ఇతర ఇంటర్నెట్‌ సర్వీసు ప్రొవైడర్లు సైతం ఐపీటీవీ సర్వీసులు అందించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని