EPS: పెన్ష‌న‌ర్లు డిజిట‌ల్ లైఫ్ స‌ర్టిఫికెట్‌ను ఎలా స‌మ‌ర్పించాలి?

స్మార్ట్‌ఫోన్ ద్వారా FaceRD యాప్‌ను ఉప‌యోగించి డిజిట‌ల్ లైఫ్ స‌ర్టిఫికేట్‌ను స‌మ‌ర్పించొచ్చు. 

Updated : 20 Sep 2022 17:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈపీఎఫ్ఓ మొబైల్ యాప్ ద్వారా ఈపీఎస్ 95 పెన్ష‌న‌ర్ల డిజిట‌ల్ లైఫ్ స‌ర్టిఫికెట్ (DLC) కోసం ఫేస్ అథెంటికేష‌న్ సాంకేతిక‌త‌ను ప్ర‌వేశ‌పెట్టింది. పెన్ష‌న్ స్కీమ్ 1995 ఈపీఎస్ పెన్ష‌న‌ర్లు సంవ‌త్స‌రానికొక‌సారి స‌మ‌ర్పించే 'జీవ‌న్ ప్ర‌మాణ్‌'ను స్మార్ట్‌ఫోన్ ద్వారా FaceRD యాప్‌ను ఉప‌యోగించి డిజిట‌ల్ లైఫ్ స‌ర్టిఫికెట్‌ను స‌మ‌ర్పించొచ్చు. 

గ‌తంలో వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో వేలి ముద్ర‌, క‌నుపాప క్యాప్చ‌ర్ చేయ‌డంలో ఇబ్బందులు ఎదుర్కొన్న పెన్ష‌న‌ర్లు.. ఇప్పుడు ఏ కార్యాల‌యానికీ వెళ్ల‌కుండా ఇంటి నుంచి, విదేశాల్లో నివ‌సిస్తున్నా కూడా త‌మ స్మార్ట్‌ఫోన్ ద్వారా FaceRD యాప్‌ ఉప‌యోగించి డిజిట‌ల్ లైఫ్ స‌ర్టిఫికేట్‌ను స‌మ‌ర్పించొచ్చు. 

డిజిట‌ల్ లైఫ్ స‌ర్టిఫికెట్‌ సమర్పించే విధానం..

  • గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఆధార్ FaceRD యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి.
  • జీవ‌న్ ప్ర‌మాణ్ పోర్ట‌ల్ నుంచి FACE (ఆండ్రాయిడ్‌)ను డౌన్‌లోడ్ చేయండి.
  • ఆప‌రేట‌ర్ అథెంటికేష‌న్ ఇవ్వాలి.
  • పెన్ష‌న‌ర్ ఆధార్‌తో అథెంటికేష‌న్ ఇవ్వాలి.
  • Sanctioning Authority, Disbursing Agencyని ఎంపిక చేసుకోవాలి, ఆధార్‌, మొబైల్‌ నంబర్, పీపీఓ నంబర్ మొద‌లైన‌వాటిని తెలపాలి.
  • ముఖాన్ని స్కాన్ చేసి Submitపై క్లిక్ చేయాలి.
  • పై ద‌శ‌లు పూర్త‌యిన త‌ర్వాత పెన్ష‌న‌ర్ లైప్ స‌ర్టిఫికెట్‌ ఆమోదిస్తారు. ఏ కార‌ణంగానైనా తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌యితే పెన్ష‌న‌ర్‌కు SMS వ‌స్తుంది.

గ‌తంలో ఈపీఎస్ పెన్ష‌న‌ర్లు త‌మ జీవిత ధ్రువీకరణ ప‌త్రాన్ని ప్ర‌తి ఏడాది న‌వంబ‌ర్ నెల‌లో స‌మ‌ర్పించాల్సి ఉండేది. ఇప్పుడు ఈపీఎస్ 1995 కింద న‌మోదైన పెన్ష‌న‌ర్లు త‌మ లైఫ్ స‌ర్టిఫికెట్‌ను సంవ‌త్స‌రంలో ఎప్పుడైనా, ఎక్క‌డి నుంచైనా స‌మ‌ర్పించొచ్చు. ఇలా స‌మ‌ర్పించిన లైఫ్ స‌ర్టిఫికెట్ ఒక సంవ‌త్స‌రం పాటు చెల్లుబాటులో ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని