iPhone 15: ఐఫోన్ 15 కొనబోతున్న ఎలాన్ మస్క్.. ఏం నచ్చిందో చెప్పిన బిలియనీర్!
iPhone 15: ఐఫోన్ 15 ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. స్టోర్ల వద్ద కొనుగోలుదారులు బారులు తీరుతున్నట్లు కుక్ ‘ఎక్స్’లో పంచుకున్నారు. దీనిపై మస్క్ స్పందిస్తూ తాను ఒక ఫోన్ కొనబోతున్నానని తెలిపారు.
వాషింగ్టన్: ఐఫోన్ 15 (iPhone 15) మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి టెక్ వర్గాల్లో చర్చంతా దాని చుట్టే తిరుగుతోంది. సెప్టెంబర్ 22నే ప్రపంచవ్యాప్తంగా దీని విక్రయాలు ప్రారంభమయ్యాయి. యాపిల్ స్టోర్ల ముందు కొనుగోలుదారులు బారులు తీరుతున్నారు. ఈ క్రమంలో ఐఫోన్ (iPhone 15)ను ఎందుకు కొంటున్నారో కొందరు తమ కారణాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. టెస్లా, ‘ఎక్స్’ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) సైతం ఐఫోన్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ప్రపంచ ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్లు స్టీఫెన్ విల్క్స్, రూబెన్ వూ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌తో బంధించిన కొన్ని చిత్రాలను యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఐఫోన్ ద్వారా పరిమితులులేని సృజనాత్మకతను సృష్టించొచ్చని వీరు నిరూపించారని కుక్ ఆ చిత్రాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ చిత్రాలతో పాటు వారితో కలిసి దిగిన ఫొటోలను కుక్ ‘ఎక్స్’లో పంచుకున్నారు. దీనిపై ఎలాన్ మస్క్ (Elon Musk) స్పందిస్తూ.. ఐఫోన్ (iPhone 15) ద్వారా తీసే చిత్రాలు, వీడియోల బ్యూటీ అపురూపమని వ్యాఖ్యానించారు.
టైప్-సి పోర్ట్.. యాక్షన్ బటన్.. ఐఫోన్ 15 సిరీస్‌లో కొత్త మార్పులివే!
అలాగే న్యూయార్క్‌లోని ఓ యాపిల్ స్టోర్ వద్ద నెలకొన్న సందడి, దానికి సంబంధించిన చిత్రాలను కుక్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దీనికి మస్క్ (Elon Musk) స్పందిస్తూ.. తానూ ఒకటి కొనబోతున్నానని వెల్లడించారు. అయితే, మస్క్ (Elon Musk) రియాక్షన్‌పై ‘ఎక్స్’లో విపరీతమైన స్పందన వస్తోంది. కొంతమంది ఆయన ఏ మోడల్, ఏ కలర్ ఫోన్‌ను కొంటున్నారో తెలుసుకోవాలని ఉందంటూ ఆసక్తి కనబరుస్తున్నారు. మరికొందరేమో బహుశా ‘ఎక్స్’లో వాణిజ్య ప్రకటనల కోసమే ఆయన ఇలా స్పందిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
boAt smartwatch: జియో e-సిమ్‌తో బోట్ తొలి స్మార్ట్‌వాచ్
boAt Lunar Pro LTE: ఇ-సిమ్ సపోర్ట్‌తో బోట్ తొలి స్మార్ట్‌వాచ్ తీసుకొస్తోంది. అంటే కాల్స్, మెసేజులు వంటి వాటికి ఇక స్మార్ట్‌ఫోన్ అక్కర్లేదు. -
Wheat: గోధుమ ధరల కట్టడికి ప్రభుత్వం చర్యలు.. నిల్వల పరిమితి మరింత కుదింపు
Wheat: టోకు, రిటైల్, బిగ్ చైన్ రిటైల్ వ్యాపారుల వద్ద ఉండాల్సిన గోధుమల నిల్వల పరిమితిని మరింత కుదిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
వాట్సప్‌లో ఇకపై వాయిస్ మెసేజ్‌లకు ‘వ్యూ వన్స్’.. త్వరలో ఈ ఫీచర్ కూడా..
WhatsApp: వ్యక్తిగత చాట్ల భద్రతలో భాగంగా ఇప్పటివరకు ఎన్నో ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సప్ ఇప్పుడు మరో ఫీచర్‌ని తీసుకొచ్చింది. -
Special Deposits: స్పెషల్ ఎఫ్డీలపై వడ్డీ రేట్లు ఎంతెంత?
అనేక బ్యాంకులు స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్లను ఆఫర్ చేస్తున్నాయి. సాధారణ ఎఫ్డీలతో పోలిస్తే స్పెషల్ ఎఫ్డీలపై వడ్డీ రేట్లు కొద్దిగా అదనంగా ఉంటున్నాయి. -
Infinix Smart 8 HD: ‘మ్యాజిక్ రింగ్’తో ఇన్ఫీనిక్స్ స్మార్ట్ 8 హెచ్డీ ఫోన్.. ధర, ఫీచర్లివే!
Infinix Smart 8 HD: స్మార్ట్ 7 హెచ్డీకి కొనసాగింపుగా స్మార్ట్ 8 హెచ్డీ ఫోన్‌ను ఇన్ఫీనిక్స్ శుక్రవారం భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం! -
డిజిటల్ రుణాలపై ఆర్బీ‘ఐ’.. లోన్ అగ్రిగేటర్లకు త్వరలో రూల్స్
RBI on Digital loans: డిజిటల్ రుణాలపై ఆర్బీఐ దృష్టి సారించింది. లోన్ అగ్రిగేటర్ల కోసం త్వరలో కొత్త నిబంధనలను తీసుకురానుంది. -
Stock Market: ఆర్బీఐ ఎఫెక్ట్.. తొలిసారి 21,000 మార్క్ అందుకున్న నిఫ్టీ!
Stock Market Closing bell: సెన్సెక్స్ 303.91 పాయింట్లు పుంజుకొని 69,825.60 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 68.25 పాయింట్లు లాభపడి 20,969.40 వద్ద ముగిసింది. -
Tata group: మరో ఐఫోన్ల ప్లాంట్‌కు టాటాలు రెడీ.. 50 వేల మందికి ఉపాధి!
Tata group- iphone: టాటా గ్రూప్ మరో అతిపెద్ద ఐఫోన్ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. దీనిద్వారా 50 వేల మందికి ఉపాధి లభించనుంది. -
UPI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఆటో డెబిట్, ఆ యూపీఐ చెల్లింపుల పరిమితి పెంపు
UPI payments: ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సమీక్ష నిర్ణయాలను శుక్రవారం వెల్లడించింది. రెపోరేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. మరోవైపు యూపీఐ, ఆటో డెబిట్ పరిమితి విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది. -
Flipkart: ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్
Flipkart Year End Sale: ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ తేదీలను ప్రకటించింది. పెద్ద ఎత్తున క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈ సేల్‌ను తీసుకొచ్చినట్లు వెల్లడించింది. -
India Shelter Finance IPO: 13న ఇండియా షెల్టర్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి రూ.469-493
India Shelter Finance IPO: రూ.1,200 కోట్ల సమీకరణే లక్ష్యంగా ఇండియా షెల్టర్ ఫైనాన్స్ ఐపీఓ ఈ నెల 13న ప్రారంభం కానుంది. -
Onion Exports: ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం..
Onion Exports: దేశంలో ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి వరకు వీటి ఎగుమతులపై నిషేధం విధించింది. -
RBI: ఐదోసారీ వడ్డీరేట్లు యథాతథం.. వృద్ధిరేటు అంచనాల పెంపు
RBI: ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ప్రకటించారు. -
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market Opening bell | ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 195 పాయింట్ల లాభంతో 69,716 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 66 పాయింట్లు పెరిగి 20,967 దగ్గర ట్రేడవుతోంది. -
ఐటీ సెజ్‌ల్లో స్థలాలకు గిరాకీ
ఐటీ/ఐటీఈఎస్ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)ని అభివృద్ధి చేసిన ఒక డెవలపర్ విజ్ఞప్తి నేపథ్యంలో.. అందులో ప్రాసెసింగేతర ప్రాంతాలకు సెజ్ హోదాను రద్దు చేసే అధికారం అంతర్ మంత్రిత్వ శాఖల బోర్డుకు ఉందని ఒక అధికారిక నోటిఫికేషన్ స్పష్టం చేసింది. -
వచ్చే బడ్జెట్లో అద్భుత ప్రకటనలుండవు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న వెల్లడించే తన ఆరో బడ్జెట్లో ‘అద్భుత ప్రకటనలు’ ఉండవని, సార్వత్రిక ఎన్నికలకు ముందు కేవలం ఓట్ ఆన్ అకౌంట్‌గానే సమర్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం, కొత్త ప్రభుత్వం జులైలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందని సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరమ్‌లో మంత్రి తెలిపారు. -
సంస్థల్లో నియామకాలు 12% తగ్గాయ్
వేర్వేరు రంగాల కార్యాలయాల్లో నైపుణ్యంతో కూడిన (వైట్-కాలర్) ఉద్యోగాల నియామకాలు గత 2 నెలల్లో తగ్గినట్లు నౌకరీ జాబ్‌స్పీక్ సూచీ నివేదిక వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఉద్యోగ పోస్టింగ్‌లు 2022 అక్టోబరు, నవంబరులో 2781 కాగా, ఈ ఏడాది అదే సమయంలో 12 శాతం తగ్గి 2,433 కు పరిమితమయ్యాయని తెలిపింది. -
2025కు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 170 గిగా వాట్లకు: ఇక్రా
దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 2025 నాటికి 170 గిగా వాట్లకు చేరుకుంటుందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్, సెక్టార్ హెడ్ - కార్పొరేట్ రేటింగ్స్ వి.విక్రమ్ అంచనా వేశారు. ప్రస్తుతం దేశీయ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 130 గిగా వాట్లుగా ఉంది. -
ఏడు రోజుల జోరుకు విరామం
సూచీల ఏడు రోజుల వరుస లాభాలకు గురువారం అడ్డుకట్ట పడింది. ఇటీవల భారీగా పెరిగిన షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించడమే ఇందుకు కారణం. బలహీన అంతర్జాతీయ సంకేతాలు ప్రభావం చూపాయి. ఆర్బీఐ పరపతి నిర్ణయాలు శుక్రవారం (నేడు) వెలువడనుండటంతో, మదుపర్లు కొంత అప్రమత్తత పాటించారు. -
వివో కేసులో తొలి ఛార్జిషీట్ దాఖలు
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో అనుబంధ సంస్థ వివో ఇండియాపై, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. వివోతో పాటు మరికొందరిపై వచ్చిన మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేసిన ఈడీ, తొలి ఛార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టులో వేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద వివో ఇండియాపై అభియోగాలు మోపింది. -
దూసుకెళ్తున్న ఈవీలు
విద్యుత్ వాహనాల (ఈవీల) అమ్మకాలు రాణిస్తున్నాయి. విద్యుత్తు విభాగంలో ప్రయాణికులు- వాణిజ్య వాహనాలు కలిపి నవంబరులో 1,52,606 యూనిట్లు అమ్ముడైనట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా గురువారం వెల్లడించింది.


తాజా వార్తలు (Latest News)
-
Aditya L1: ఆదిత్య తీసిన ‘సూర్యుడి’ అరుదైన చిత్రాలు!
-
KCR: కేసీఆర్‌కు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ పూర్తి
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Rashmika: గీతాంజలి పాత్ర నాకెంతో నచ్చింది.. ‘యానిమల్’ సక్సెస్‌పై స్పందించిన రష్మిక
-
boAt smartwatch: జియో e-సిమ్‌తో బోట్ తొలి స్మార్ట్‌వాచ్
-
Shocking: ఎస్సై చేతిలో పొరపాటున పేలిన తుపాకీ.. మహిళ తలలోకి దూసుకెళ్లిన తూటా!