గేట్స్‌ ఫౌండేషన్‌ మరో రూ.10 వేల కోట్ల విరాళం

సామాజిక అసమానతలు, పేదరికం వంటి సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేందుకు బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ మరో 1.27 బిలియన్‌ డాలర్ల (రూ.10.25 వేల కోట్లు) ఆర్థిక సాయాన్ని ప్రకటించింది....

Published : 22 Sep 2022 13:48 IST

న్యూయార్క్‌: సామాజిక అసమానతలు, పేదరికం వంటి సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేందుకు బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ మరో 1.27 బిలియన్‌ డాలర్ల (రూ.10.25 వేల కోట్లు) ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ దాతృత్వ సంస్థ ఏటా నిర్వహించే వార్షిక సమావేశం న్యూయార్క్‌లోని లింకన్‌ సెంటర్‌లో బుధవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాధినేతలు, ప్రముఖులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా విడుదల చేసిన గోల్‌కీపర్స్‌ నివేదికలో గేట్స్‌ ఫౌండేషన్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. 2030 నాటికి సాధించాల్సిన ఐరాస నిర్దేశిత సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన ప్రతి అంశంలో మార్గం తప్పుతున్నామని తెలిపింది. వీటిని తిరిగి గాడిన పెట్టేందుకు అనేక సవాళ్లున్నప్పటికీ.. దీర్ఘకాల, వినూత్న పరిష్కార మార్గాలతో సాధించేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఇప్పటి వరకు సాధించిన పురోగతిని కొనసాగించేందుకు తాజా ఆర్థిక సాయాన్ని వినియోగించనున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని