బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌, ఖతార్‌ ఎయిర్‌వేస్‌ భాగస్వామ్య విస్తరణ

బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌, ఖతార్‌ ఎయిర్‌వేస్‌ మధ్య భాగస్వామ్య ఒప్పందం మరింత విస్తరణకు నోచుకుంది. ఈ రెండు ఎయిర్‌లైన్స్‌ కలిపి నూతనంగా 42 దేశాలకు సర్వీసులు నడిపిస్తున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి.

Published : 28 Sep 2022 02:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌, ఖతార్‌ ఎయిర్‌వేస్‌ మధ్య భాగస్వామ్య ఒప్పందం మరింత విస్తరణకు నోచుకుంది. ఈ రెండు ఎయిర్‌లైన్స్‌ కలిపి నూతనంగా 42 దేశాలకు సర్వీసులు నడిపిస్తున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. ఇటలీ, మాల్దీవులు, నార్వే, సింగపూర్‌, స్వీడన్‌ వంటి దేశాలకు రెండు సంస్థల భాగస్వామ్యంతో సర్వీసులు నడుస్తున్నట్లు తెలిపాయి. దీనివల్ల విమాన టికెట్ల ధరలు, సర్వీసుల పరంగా ప్రయాణికులకు వెసులుబాటు లభించనుందని వివరించాయి. ఒకే టికెట్‌పై దోహా, లండన్‌ మధ్య ప్రయాణించేందుకు వీలు కలుగనుంది. రెండు సంస్థలు సంయుక్తంగా 60దేశాలలోని 185 గమ్యస్థానాలకు సర్వీసులు నడిపిస్తున్నట్లు బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో సీయాన్‌ డోలే, ఖతార్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో అక్బర్‌ అల్‌ బకర్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని