జీఎస్‌టీలో ఆ నేరాలు క్రిమినల్‌ పరిధిలోకి రావు!

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)కి సంబంధించి కొన్ని నేరాలను.. క్రిమినల్‌ పరిధి నుంచి బయటకు తీసుకు వచ్చేంద]ుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దర్యాప్తు  చేపట్టేందుకు నిర్దేశించిన పరిమితిని పెంచనున్నట్లు చెప్పారు. రూ.5 కోట్లకు మించి

Published : 29 Sep 2022 02:29 IST

విచారణ ప్రారంభానికి నిర్దేశించిన పరిమితి పెంపునకు యోచన
కాంపౌండింగ్‌ ఛార్జీలూ తగ్గింపు

దిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)కి సంబంధించి కొన్ని నేరాలను.. క్రిమినల్‌ పరిధి నుంచి బయటకు తీసుకు వచ్చేంద]ుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దర్యాప్తు  చేపట్టేందుకు నిర్దేశించిన పరిమితిని పెంచనున్నట్లు చెప్పారు. రూ.5 కోట్లకు మించి జీఎస్‌టీ ఎగవేత లేదా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) దుర్వినియోగానికి పాల్పడిన సందర్భాల్లోనే విచారణ చేపట్టాలని ప్రస్తుతం జీఎస్‌టీ చట్టం నిబంధనలు చెబుతున్నాయి. ‘విచారణ ప్రక్రియను సులభతరం చేసేందుకు, పన్ను చెల్లింపుదార్లకు అనువుగా ఉండేలా జీఎస్‌టీ చట్టంలో విచారణ నిబంధనల్లో మార్పులపై కసరత్తు చేస్తున్నాం. సీజీఎస్‌టీ చట్టంలోని 131 సెక్షన్‌ ప్రకారం.. జీఎస్‌టీ ఎగవేత, అక్రమంగా ఐటీసీని క్లెయిమ్‌ చేసుకుంటే క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తారు. ఎంతమొత్తం ఎగవేత కేసుల్లో దర్యాప్తు  చేపట్టాలనే పరిమితిపై పునఃపరిశీలన చేస్తున్నామ’ని ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి (రెవెన్యూ) వివేక్‌ అగర్వాల్‌ తెలిపారు. పన్ను అధికారులు దర్యాప్తు ప్రక్రియ చేపట్టడం అంటే.. నేరస్థుడిపై చట్టపరమైన చర్యలు మొదలయ్యాయని అర్థం. జీఎస్‌టీ నేరాలకు కాంపౌండింగ్‌ ఛార్జీలను తగ్గించనున్నట్లు ఆ అధికారి తెలిపారు. కోర్టును ఆశ్రయించడానికి బదులు తమ నేరాలకు కాంపౌండింగ్‌ ఛార్జీలు చెల్లించి, పరిష్కరించుకునేలా పన్ను చెల్లింపుదార్లను ప్రోత్సహించడం దీని వెనక ఉద్దేశం. జీఎస్‌టీ చట్టం ప్రకారం.. చెల్లించాల్సిన పన్ను మొత్తంలో కాంపౌండింగ్‌ ఛార్జీల కింద 50 శాతం చెల్లించాలి. ఇది కనిష్ఠంగా రూ.10,000, గరిష్ఠంగా రూ.30,000 లేదంటే పన్ను మొత్తంలో 150 శాతం ఏది ఎక్కువైతే దానిని చెల్లించాల్సి ఉంటుంది.  దీనిపైన పరిశీలన చేస్తున్నట్లు అగర్వాల్‌ చెప్పారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts