రిటైల్‌ డిజిటల్‌ రూపాయి వచ్చేసింది

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) తన రిటైల్‌ డిజిటల్‌ రూపాయిని ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద ముంబయి, దిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌ నగరాల్లో ఆవిష్కరించింది.

Published : 02 Dec 2022 03:45 IST

4 నగరాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభం

దిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) తన రిటైల్‌ డిజిటల్‌ రూపాయిని ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద ముంబయి, దిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌ నగరాల్లో ఆవిష్కరించింది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌లు ప్రాథమికంగా ఈ సేవలను పరిమిత సంఖ్యలోని వినియోగదార్లు, వ్యాపారులకు అందించడం మొదలుపెట్టాయి. టోకు విభాగంలో డిజిటల్‌ రూపాయిని నవంబరు 1నే ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. రెండో దశలో రిటైల్‌ డిజిటల్‌ రూపాయి(ఇRs-ఆర్‌)ని మరో తొమ్మిది నగరాలు, నాలుగు బ్యాంకులకు విస్తరిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని