Reliance Retail: హైదరాబాద్‌లో రిలయన్స్‌ రిటైల్‌ అజార్ట్‌ స్టోర్‌

రిలయన్స్‌ గ్రూపునకు చెందిన ప్రీమియం ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌ బ్రాండెడ్‌ స్టోర్‌ ‘అజార్ట్‌’ హైదరాబాద్‌లో ప్రారంభం అయింది.

Updated : 11 Dec 2022 06:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: రిలయన్స్‌ గ్రూపునకు చెందిన ప్రీమియం ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌ బ్రాండెడ్‌ స్టోర్‌ ‘అజార్ట్‌’ హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. హైటెక్‌ సిటీ సమీపంలోని కొండాపూర్‌లో ఉన్న శరత్‌ సిటీ కేపిటల్‌ మాల్‌లో ఈ బ్రాండెడ్‌ స్టోర్‌ను ఏర్పాటు చేసినట్లు రిలయన్స్‌ రిటైల్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. దాదాపు 18,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ స్టోర్‌లో వినియోగదార్లను ఆకట్టుకునే ఎన్నో వినూత్నమైన ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో దేశ, విదేశీ బ్రాండ్ల దుస్తులు, పాదరక్షలు, ఫ్యాషన్‌ వస్తువులు ఉన్నట్లు వివరించింది. హైదరాబాద్‌లో ఏర్పాటైన ‘అజార్ట్‌’ స్టోర్‌ దేశవ్యాప్తంగా మూడోది. మొదటి స్టోర్‌ కొంతకాలం క్రితం బెంగుళూరులోని ఎంజీ రోడ్లో ఏర్పాటు చేశారు. రెండో స్టోర్‌ నవీ ముంబయిలో ఉంది. సమీప భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరికొన్ని నగరాల్లో ‘ఆజార్ట్‌’  స్టోర్లు ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్‌ రిటైల్‌ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు