‘టాటా న్యూ’లోకి మరో రూ.16,400 కోట్లు!

టాటా గ్రూప్‌ తన సూపర్‌ యాప్‌ ‘టాటా న్యూ’లోకి మరో 2 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.16,400 కోట్ల) పెట్టుబడులు పెట్టనున్నట్లు ఈ అంశాలతో సంబంధమున్న వ్యక్తులను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది.

Published : 24 Mar 2023 01:35 IST

ముంబయి: టాటా గ్రూప్‌ తన సూపర్‌ యాప్‌ ‘టాటా న్యూ’లోకి మరో 2 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.16,400 కోట్ల) పెట్టుబడులు పెట్టనున్నట్లు ఈ అంశాలతో సంబంధమున్న వ్యక్తులను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. రెండేళ్లలో ఈ పెట్టుబడులు అందే అవకాశముందని తెలిపింది.  టాటా గ్రూప్‌ కానీ.. టాటా డిజిటల్‌ కానీ ఈ అంశాన్ని ధ్రువీకరించలేదు. ఒక వేళ ఈ పెట్టుబడి సాకారమైతే, తన డిజిటల్‌ ఆఫర్లను మరింత పెంచుకోడానికి, సాంకేతికతలను మెరుగుపరచుకోవడానికి, ఇతరత్రా అవసరాలకు ఉపయోగపడతాయని సమాచారం. టాటా న్యూలో నిత్యావసర వస్తువుల నుంచి గాడ్జెట్ల వరకు కొనుగోలు చేయొచ్చు. విమానాల్లో సీట్ల నుంచి రెస్టారెంట్ల వరకు టాటా బ్రాండ్‌ కింద ఉన్న సంస్థల్లో బుక్‌ చేసుకోవచ్చు. సభ్యత్వ సేవలనూ అందిస్తున్న ఈ యాప్‌ బిల్లుల చెల్లింపు, రుణాలు, బీమా వంటి ఆర్థిక సేవలనూ అందిస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో ఈ యాప్‌ను ప్రారంభించగా, కొత్తలో సాంకేతిక అవాంతరాలను ఎదుర్కొంది. తాజా పెట్టుబడులు వస్తే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లకు పోటీ ఇచ్చేలా యాప్‌ను అభివృద్ధి చేయొచ్చన్నది సంస్థ భావన. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అదానీ గ్రూప్‌ సైతం తమ సొంత సూపర్‌ యాప్‌లను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని