ఆర్‌బీఐ పరపతి సమావేశం 3-6న

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) పరపతి విధాన కమిటీ(ఎమ్‌పీసీ) వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆరు సార్లు సమావేశం కానుంది.

Published : 25 Mar 2023 03:08 IST

2023-24లో మొత్తం 6 సార్లు భేటీ

ముంబయి: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) పరపతి విధాన కమిటీ(ఎమ్‌పీసీ) వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆరు సార్లు సమావేశం కానుంది. ఈ రేట్ల నిర్ణాయక ప్యానెల్‌ తన తొలి సమావేశాన్ని ఏప్రిల్‌ 3-6 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ మేరకు శుక్రవారం విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం.. 2023-24లో ఏప్రిల్‌ 3-6; జూన్‌ 6-8; ఆగస్టు 8-10; అక్టోబరు 4-6; డిసెంబరు 6-8; ఫిబ్రవరి 6-8 తేదీల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. గవర్నర్‌ ఆధ్వర్యంలోని ఈ కమిటీలో ఆర్‌బీఐ నుంచి ఇద్దరు ప్రతిధులు ఉంటారు. బయటి వ్యక్తులు ముగ్గురు సభ్యులుగా ఉంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని