టాటా మోటార్స్‌ ఆల్ట్రోజ్‌ సీఎన్‌జీ

సీఎన్‌జీతో నడిచే ఆల్ట్రోజ్‌ కారును టాటా మోటార్స్‌ సోమవారం విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.7.55 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌, దేశం మొత్తం). ఆల్ట్రోజ్‌ ఐసీఎన్‌జీ 6 వేరియంట్లలో లభ్యమవుతుంది.

Published : 23 May 2023 02:15 IST

ప్రారంభ ధర రూ.7.55 లక్షలు

దిల్లీ: సీఎన్‌జీతో నడిచే ఆల్ట్రోజ్‌ కారును టాటా మోటార్స్‌ సోమవారం విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.7.55 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌, దేశం మొత్తం). ఆల్ట్రోజ్‌ ఐసీఎన్‌జీ 6 వేరియంట్లలో లభ్యమవుతుంది. ఈ వాహన ధరల శ్రేణి రూ.7.55- 10.55 లక్షలు. 2-సిలిండర్‌ సీఎన్‌జీ సాంకేతికతతో పాటు వాయిస్‌-అసిస్టెడ్‌ ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, వైర్‌లెస్‌ ఛార్జర్‌, ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ వంటి ఆధునిక సదుపాయాలు ఈ కార్లలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. 2 సీఎన్‌జీ సిలిండర్లు లగేజీ ఏరియా కింద ఉంటాయి. లోడ్‌ ఫ్లోర్‌ కింద వాల్వ్‌లు, పైప్‌లతో రక్షణ కలిగి ఉండటంతో నష్ట భయం తక్కువగా ఉంటుంది. ‘వినియోగదార్లు ఆర్థికంగా అనువైన, పర్యావరణహిత వాహనాలను కోరుకుంటున్నారు.  అందుకే ఆల్ట్రోజ్‌లో సీఎన్‌జీ వెర్షన్‌ తీసుకొచ్చామ’ని టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌, టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ఎండీ శైలేష్‌ చంద్ర వెల్లడించారు. గత ఏడాది జనవరిలో టియాగో, టిగోర్‌ మోడళ్లలోనూ ఐసీఎన్‌జీ వెర్షన్‌లను సంస్థ విడుదల చేసింది. ఆల్ట్రోజ్‌ ఐసీఎన్‌జీల్లో ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఆర్‌16 డైమండ్‌ కట్‌ అల్లాయ్‌ వీల్స్‌, 8-స్పీకర్‌ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ప్లే కనెక్టివిటీ తదితర ప్రీమియం ఫీచర్లు ఉంటాయని టాటా మోటార్స్‌ తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని