మారుతీ సుజుకీకి 4,500 సేవా కేంద్రాలు

కొవిడ్‌ పరిణామాల తరవాత అన్ని ఖర్చులూ పెరిగినప్పటికీ, మారుతీ సుజుకీ కార్ల మరమ్మతుకు వినియోగదార్లకు అయ్యే వ్యయం నియంత్రణలో ఉందని సంస్థ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సర్వీస్‌) పార్థో బెనర్జీ అన్నారు.

Published : 07 Jun 2023 03:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ పరిణామాల తరవాత అన్ని ఖర్చులూ పెరిగినప్పటికీ, మారుతీ సుజుకీ కార్ల మరమ్మతుకు వినియోగదార్లకు అయ్యే వ్యయం నియంత్రణలో ఉందని సంస్థ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సర్వీస్‌) పార్థో బెనర్జీ అన్నారు. అయితే విడిభాగాల ఉత్పత్తి అధికమైనందున, కొంత భారాన్ని బదిలీ చేయక తప్పడం లేదని వివరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని రాంపల్లిలో నూతన నెక్సా సర్వీస్‌ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా మారుతీకి 4,500 సర్వీస్‌ కేంద్రాలు ఉన్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 326 టచ్‌ పాయింట్లు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా 395 సర్వీస్‌ ఆన్‌ వీల్స్‌ వర్క్‌షాపులున్నాయని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో 10-15 కిలోమీటర్లకు, గ్రామీణ ప్రాôతాల్లో ప్రతి 25 కిలోమీటర్లకు ఒక సేవా కేంద్రం ఉండాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 350     కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. రోజుకు 60వేలకు పైగా కార్లను సర్వీసింగ్‌ చేస్తున్నామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని