స్పైస్‌జెట్‌కు మరో 10 బీ737 విమానాలు
సెప్టెంబరు- అక్టోబరు మధ్య లీజింగ్ ద్వారా మరో 10 న్యారో బాడీ బోయింగ్ (బీ737) విమానాలు తమకు అందుబాటులోకి వస్తాయని స్పైస్‌జెట్ తెలిపింది.
సెప్టెంబరు- అక్టోబరు మధ్య లీజింగ్ ద్వారా మరో 10 న్యారో బాడీ బోయింగ్ (బీ737) విమానాలు తమకు అందుబాటులోకి వస్తాయని స్పైస్‌జెట్ తెలిపింది. ఆ సమయంలో భారత్‌లో పర్యాటకానికి సానుకూల పరిస్థితులు ఉండటంతో మరిన్ని కొత్త మార్గాలకు విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ఈ అదనపు విమానాలు ఉపయోగపడతాయని స్పైస్‌జెట్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ తెలిపారు. ఈ 10 విమానాలకు సంబంధించి ఇప్పటికే లీజింగ్ ఒప్పంద పత్రాలపై సంతకాల ప్రక్రియ పూర్తయ్యిందని స్పైస్‌జెట్ తెలిపింది. ఇందులో 5 బీ737 మ్యాక్స్ విమానాలు అని పేర్కొంది. కాగా.. విమాన అద్దె సంస్థలతో చెల్లింపులకు సంబంధించిన సమస్యల కారణంగా ఇప్పటికే పలు విమానాలను స్పైస్‌జెట్ నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే అదనంగా అద్దెకు తీసుకుంటున్న 10 విమానాలు వచ్చే లోగా.. ఇప్పటికే ఆపేసిన విమానాల సర్వీసుల పునరుద్ధరణకు ప్రయత్నించనున్నట్లు స్పైస్‌జెట్ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jawan: ‘జవాన్’లో నయనతార పాత్ర అద్భుతం.. కానీ..: షారుక్ ఖాన్
-
Motkupalli Narasimhulu : జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత : మోత్కుపల్లి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన