కొంచెం కొంచెం కోత పెట్టెయ్‌!

ఆహారం, ఎరువులపై ఇస్తున్న రాయితీల్లో కేంద్ర ప్రభుత్వం ఏడాదికేడాదికీ కోత విధిస్తూ వస్తోంది. 2024-25కి ఆహారం, ఎరువులపై రాయితీలను రూ.3.69 లక్షల కోట్లుగా నిర్ణయించింది.

Updated : 02 Feb 2024 05:26 IST

ఆహారం, ఎరువులపై రాయితీల్లో తగ్గుదల

దిల్లీ: ఆహారం, ఎరువులపై ఇస్తున్న రాయితీల్లో కేంద్ర ప్రభుత్వం ఏడాదికేడాదికీ కోత విధిస్తూ వస్తోంది. 2024-25కి ఆహారం, ఎరువులపై రాయితీలను రూ.3.69 లక్షల కోట్లుగా నిర్ణయించింది. మార్చి 31, 2024తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాలతో పోలిస్తే ఇది 8 శాతం తక్కువ. వచ్చే ఏడాది ఆహార సబ్సిడీ కోసం రూ.2,05,250 కోట్లను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల ప్రకారం ఆహారంపై రాయితీ రూ.2,12,322 కోట్లు. ఇది 2022-23లో రూ.2.72 లక్షల కోట్లు కావడం గమనార్హం. వచ్చే ఏడాది ఎరువులపై ఇవ్వనున్న రాయితీలను రూ.1.64 లక్షల కోట్లుగా నిర్ణయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల ప్రకారం... రాయితీ రూ.1.89 లక్షల కోట్లు. గత ఏడాది రూ.2.51 లక్షల కోట్లను ఎరువులపై సబ్సిడీల కోసం కేటాయించారు.


వచ్చే ఏడాదికి పెట్రోలియంపై ఇచ్చే రాయితీని రూ.11,925 కోట్లుగా నిర్ణయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనా (రూ.12,240 కోట్లు)తో పోలిస్తే ఇది తక్కువ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని