బంగారం ఫండ్లలో మదుపు చేయొచ్చా?
మీ వార్షికాదాయానికి 12 రెట్ల వరకూ బీమా రక్షణ ఉండేలా చూసుకోండి. అంటే, మీకు దాదాపు రూ.60 లక్షల వరకూ బీమా అవసరం. ఈ మొత్తాన్ని ఒకే బీమా సంస్థ నుంచి కాకుండా, మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు బీమా సంస్థలను ఎంచుకొని, రూ.30 లక్షల చొప్పున టర్మ్ పాలసీలను తీసుకోండి
- నాకు నెలకు రూ.40వేల వేతనం వస్తోంది. టర్మ్ పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. నా వయసు 26. ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలి? నెలకు రూ.8 వేల వరకూ మదుపు చేయాలంటే ఏం చేయాలి?
ప్రదీప్
మీ వార్షికాదాయానికి 12 రెట్ల వరకూ బీమా రక్షణ ఉండేలా చూసుకోండి. అంటే, మీకు దాదాపు రూ.60 లక్షల వరకూ బీమా అవసరం. ఈ మొత్తాన్ని ఒకే బీమా సంస్థ నుంచి కాకుండా, మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు బీమా సంస్థలను ఎంచుకొని, రూ.30 లక్షల చొప్పున టర్మ్ పాలసీలను తీసుకోండి. ఆరు నెలలకు సరిపోయే విధంగా అత్యవసర నిధిని సిద్ధం చేసుకోండి. కనీసం రూ.5 లక్షల ఆరోగ్య బీమా పాలసీ తప్పనిసరి. మీరు పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయండి.
- మూడేళ్ల మా అమ్మాయి పేరుమీద నెలకు రూ.15 వేల వరకూ పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. దీని కోసం ఏ పథకాలు ఎంచుకోవాలి?
కృష్ణారావు
- ముందుగా మీ పాప భవిష్యత్ అవసరాలకు ఆర్థిక రక్షణ కల్పించండి. ఇందుకోసం మీ పేరుపైన తగినంత మొత్తానికి టర్మ్ పాలసీ తీసుకోండి. విద్యా ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా మీ పెట్టుబడులు రాబడిని అందించేలా చూసుకోండి. రూ.15 వేలలో రూ.5,000 సుకన్య సమృద్ధి పథకంలో జమ చేయండి. మిగతా రూ.10,000 డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. నెలకు రూ.15,000 క్రమం తప్పకుండా 15 ఏళ్లపాటు మదుపు చేస్తే, వార్షిక సగటు రాబడి 11 శాతం అంచనాతో రూ.61,93,000 అయ్యేందుకు అవకాశం ఉంది.
రెండేళ్ల తర్వాత బంగారం కొనేందుకు నెలకు రూ.30వేల చొప్పున మదుపు చేయాలని అనుకుంటున్నాను. ఇందుకోసం రికరింగ్ డిపాజిట్ చేయాలా? బంగారం ఫండ్లు మంచివా?
రూప
- మీరు బంగారం కొనాలని అనుకుంటున్నారు కాబట్టి, రికరింగ్ డిపాజిట్ చేయడం వల్ల లాభం ఉండదు. రెండేళ్ల తర్వాత బంగారం ధర పెరిగితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి, ఆర్‌డీకి బదులు గోల్డ్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. బంగారం ధరకు అనుగుణంగా వీటి యూనిట్ల విలువా మారుతుంది. మీకు అవసరమైనప్పుడు ఈ యూనిట్లను అమ్మేసి, వచ్చిన డబ్బుతో బంగారాన్ని కొనొచ్చు.
నా వయసు 65. ఫిక్స్‌డ్ డిపాజిట్ వ్యవధి ముగిసి, రూ.4 లక్షలు వెనక్కి వచ్చాయి. వీటిని తిరిగి ఎఫ్‌డీ చేయాలా? కనీసం 9 శాతం రాబడినిచ్చేలా ఏదైనా ఇతర పథకాలున్నాయా?
మోహన్
- సురక్షితమైన పథకాల్లో 9 శాతం రాబడిని అందుకోవడం కష్టమే. ఇప్పుడు చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వరకూ వడ్డీని అందిస్తున్నాయి. కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కాస్త అధిక వడ్డీ ఇస్తున్నాయి. ప్రత్యామ్నాయంగా పోస్టాఫీసు పెద్దల పొదుపు పథకం ఎంచుకోవచ్చు. ఇందులో ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. మూడు నెలలకోసారి వడ్డీని చెల్లిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!
-
విశాఖలో పిడుగు పాటు.. వీడియో వైరల్
-
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
-
రావణుడి అత్తవారింట రామాలయం.. 35 ఏళ్లుగా తిరిగిచూడని భక్తులు
-
Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు నివాసం వద్ద అర్ధరాత్రి భారీగా పోలీసుల మోహరింపు
-
సముద్రంలో 36 గంటలు.. గణపతి విగ్రహ చెక్కబల్లే ఆధారంగా..