Nitin Gadkari: ఆటోమొబైల్‌ రంగంలో భారత్‌ను అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యం: గడ్కరీ

గాంధీనగర్‌లో జరుగుతున్న ‘గుజరాత్‌ అంతర్జాతీయ సదస్సు 2024’లో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) ఆటోమొబైల్‌ రంగం గురించి మాట్లాడారు.

Published : 11 Jan 2024 21:18 IST

గాంధీనగర్‌: ప్రపంచంలోనే టాప్‌ ఆటోమొబైల్‌ తయారీ హబ్‌గా భారత్‌ను మార్చటమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) అన్నారు. ఈ రంగాన్ని రూ.25 లక్షల కోట్ల పరిశ్రమగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. విద్యుత్‌ వాహన తయారీలో పెట్టుబడులు పెట్టాలని ఆటోమొబైల్ తయారీ దారులకు సూచించారు. గాంధీనగర్‌లో జరుగుతున్న ‘గుజరాత్‌ అంతర్జాతీయ సదస్సు 2024’ లో ఆయన మాట్లాడారు.

‘ఆటోమొబైల్‌ రంగంలో భారత్‌ను అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యం. నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రపంచ ఆటోమొబైల్‌ రంగంలో భారత్‌ ఏడో స్థానంలో ఉండేది. ఇప్పుడు జపాన్‌ను అధిగమించి మూడో స్థానంలో నిలిచాం. మోదీ పాలనలో ఈ ఘనత సాధించాం. ఈ పరిశ్రమ 4 కోట్ల ఉద్యోగాలు కల్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యధిక ఆదాయాన్ని అందిస్తోంది’ అని గడ్కరీ అన్నారు. అంతర్జాతీయంగా ఆటోమొబైల్‌ రంగానికి డిమాండ్‌ ఉందన్న ఆయన.. గత కొన్నేళ్లలోనే దేశంలో ఎలక్ట్రిక్‌ వాహన అమ్మకాలు బాగా పెరిగాయని తెలిపారు.

గూగుల్‌, అమెజాన్‌లో మరోసారి తొలగింపులు

ఈ కార్యక్రమంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్‌ పాండే మాట్లాడుతూ.. దేశంలో విద్యుత్‌ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (FAME) స్కీమ్‌ను, అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్‌ (ACC) బ్యాటరీల కోసం పీఎల్‌ఐ వంటి అనేక పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. పీఎల్‌ఐ పథకం కింద చేపట్టబోయే ఏసీసీ బ్యాటరీ ఉత్పత్తి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని