IOC Q4 results: తగ్గిన క్రూడ్‌.. ఐఓసీ లాభం 67 శాతం జంప్‌

IOC Q4 results: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ జనవరి-మార్చి త్రైమాసికంలో లాభంలో 67 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Published : 16 May 2023 20:27 IST

దిల్లీ: ప్రభుత్వరంగ చమురు సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (IOC) త్రైమాసిక ఫలితాల్లో రాణించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో (Q4 Results) లాభంలో 67 శాతం వృద్ధిని నమోదు చేసింది. చమురు విక్రయాలు, రిఫైనింగ్‌ మార్జిన్లు కంపెనీకి కలిసొచ్చాయి. జనవరి-మార్చి త్రైమాసికంలో స్టాండలోన్‌ ప్రాతిపదికన రూ.10,058.69 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.6021.88 కోట్లుగా ఉంది. ఇక మొత్తం ఏడాదికి గానూ రూ.8,241.82 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. నాలుగో త్రైమాసిక లాభం ఇందుకు దోహదం చేసింది.

ఐఓసీతో పాటు, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ గతేడాది ఏప్రిల్‌ 6 నుంచి పెట్రోల్‌ ధరలను స్థిరంగా ఉంచుతున్నాయి. అప్పట్లో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు 100డాలర్లకు పైనే ఉంది. దీంతో ఆయా సంస్థలు నష్టాలు ఎదుర్కొన్నాయి. అయితే ప్రస్తుతం క్రూడ్‌ 75 డాలర్లకు దిగి వచ్చింది. ఇప్పుడూ పెట్రోల్‌, డీజిల్‌ను అదే ధరకు విక్రయిస్తూ ఆయా సంస్థలు దీంతో నష్టాలను భర్తీ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే క్యూ4లో ఐఓసీ లాభాలను నమోదు చేసింది. అదే విధంగా ఒక్కో షేరుకు రూ.3 చొప్పున తుది డివిడెండ్‌ ఇచ్చేందుకు ఐఓసీ బోర్డు సిఫార్సు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని