HDFC ERGO: త‌క్కువ తిరిగే కారుకు త‌క్కువ బీమా ప్రీమియం!

త‌క్కువ డ్రైవ్ చేసేవారికి ప్ర‌యోజ‌నం ఉండేలా పాల‌సీని హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో ప్ర‌వేశ‌పెట్టింది.

Published : 11 Aug 2022 11:31 IST

కారు బీమా ప్రీమియంలో వినియోగ‌దారునికి అనుకూల‌మైన‌ మార్పులు వ‌చ్చాయి. కారు ఎన్ని కిలోమీట‌ర్లు ప్ర‌యాణించిందో దాని ఆధారంగా పాల‌సీదారుల‌కు కారు ప్రీమియం చెల్లించ‌డానికి వీలు క‌లిగేలా `పే యాజ్ యూ డ్రైవ్‌` ఆప్ష‌న్ అనుమ‌తిస్తుంది. త‌క్కువ ప్రయాణించేవారికి దీని వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉండేలా హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో పాల‌సీని ప్ర‌వేశ‌పెట్టింది.

హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో `పే యాజ్ యూ డ్రైవ్‌` కిలోమీట‌ర్ బెనిఫిట్ యాడ్‌-ఆన్ క‌వ‌ర్‌ని ప్రారంభించింది. ఒక సంవ‌త్స‌రంలో 10 వేల కి.మీ కంటే త‌క్కువ డ్రైవింగ్ చేసే వారు ఎవ‌రైనా `ఓడోమీట‌ర్` రీడింగ్‌కు లోబ‌డి వారి స్వంత డ్యామేజ్ ప్రీమియంలో 25% వ‌ర‌కు ప్ర‌యోజ‌నం పొందొచ్చు. వినియోగ‌దారులు నిర్ణీత ప‌రిమితికి మించి డ్రైవ్ చేసినా, వారు దాని కోసం అద‌నంగా రుసుములు క‌ట్ట‌న‌క్క‌ర్లేదు. వారు త‌మ ప్రైవేట్ కారు బీమా పాల‌సీ ప‌రిధిలోనే ఉంటారు.

స్వ‌ల్ప‌దూరం మాత్ర‌మే ప్ర‌యాణించే కార్లు చాలా ఉంటాయి. కాని వీరు అధిక దూరానికి ప్ర‌య‌ణించే కార్ల‌తో స‌మానంగా బీమా ప్రీమియం చెల్లిస్తూ ఉంటారు. ఈ `పే యాజ్ యూ డ్రైవ్‌` కిలోమీట‌ర్ బెనిఫిట్‌తో ఎక్కువ ప్ర‌యాణం చేయ‌ని కార్ల వినియోగ‌దారుల‌కు, ఒక‌టి క‌న్నా ఎక్కువ కార్లు క‌లిగి ఉన్న‌వారికి ప్ర‌యోజ‌నం ఉంటుంది. ఉదా: కొంత మంది ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన‌వారికి కారు ఉంటుంది కాని అలాంటివారు ఎక్కువ కి.మీ. తిర‌గ‌డానికి కారు ఉప‌యోగించ‌రు. ఇటువంటి వారికి ఈ బీమా ప్రీమియం త‌క్కువ‌గా ఉంటుంది.

క్లెయిమ్‌లు లేకుండా హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గోతో పాల‌సీని పున‌రుద్ధ‌రించిన‌ట్ల‌యితే అద‌నంగా 5% త‌గ్గింపును పొందుతారు. మీరు పాల‌సీని పున‌రుద్ధ‌రించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ప్ప‌టికీ, ప్ర‌యాణించిన దూరాన్ని స‌మ‌ర్పించిన త‌ర్వాత‌, పాల‌సీ సంవ‌త్స‌రం చివ‌రిలో ఎంచుకున్న ప్ర‌యోజ‌నం వ‌ర్తిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని