Maruti Suzuki Sales: మారుతీ సుజుకీ విక్రయాల్లో 8.28% వృద్ధి

దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ బలమైన విక్రయాలు నమోదు చేసింది....

Published : 01 Aug 2022 22:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సెమీకండక్టర్ల కొరతతో సతమైన వాహన పరిశ్రమ తిరిగి క్రమంగా పుంజుకుంటోంది. జూన్‌లో నెలలో విక్రయాల్లో వృద్ధి నమోదు కాగా.. జులైలోనూ అది కొనసాగింది. దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ జులైలో బలమైన విక్రయాలు నమోదు చేసింది. మారుతీ విక్రయాలు 2021 జులైలో 1,62,462 కాగా, గత నెలలో 8.28 శాతం వృద్ధి చెంది 1,75,916కు చేరాయి. దేశీయ విక్రయాలు 1,33,732 యూనిట్ల నుంచి 1,42,850 యూనిట్లకు పెరిగాయి.

* స్విఫ్ట్‌, సెలెరియో, ఇగ్నిస్‌, బాలెనో, డిజైర్‌, వేగనార్‌ వంటి కాంపాక్ట్‌ మోడళ్ల విక్రయాలు 70,268 నుంచి 84,818కు చేరాయి.

* విటారా బ్రెజా, ఎస్‌-క్రాస్‌, ఎర్టిగా వంటి వినియోగ వాహన విక్రయాలు 32,272 నుంచి 23,272కు పెరిగాయి.

* చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్‌-ప్రెస్సోల విక్రయాలు 20,333 వాహనాల నుంచి 19,685కు పరిమితమయ్యాయి.

* మిడ్‌-సైజ్‌ సెడాన్‌ సియాజ్‌ విక్రయాలు 1,450 యూనిట్ల నుంచి 1,379కి తగ్గాయి.

* వాణిజ్య వాహన విభాగంలో వ్యాన్‌ ఈకో విక్రయాలు 13,048 యూనిట్లుగా నమోదైనట్లు మారుతీ వెల్లడించింది. లైట్‌ కమర్షియల్‌ వెహికల్స్‌ విభాగంలో సూపర్‌ క్యారీ విక్రయాలు 2,768 యూనిట్ల నుంచి 2,816 యూనిట్లకు చేరినట్లు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని