MF Nomination: మ్యూచువల్‌ ఫండ్‌ నామినేషన్‌ డెడ్‌లైన్‌ పొడిగింపు

Nomination Deadline: డీమ్యాట్‌, ట్రేడింగ్ ఖాతాదారులకు నామినీ విషయంలో సెబీ ఊరట కల్పించింది. దీనికి సంబంధించిన గడువును పొడిగించింది.

Published : 28 Mar 2023 18:55 IST


దిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌లో (Mutual Funds) మదుపు చేసే వారికి సెబీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ మదుపరులకు నామినీ వివరాల దాఖలుకు ఇచ్చిన గడువును పొడిగించింది. మార్చి 31తో గడువు ముగియాల్సి ఉండగా.. ఈ గడువును సెప్టెంబర్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.  మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారు తప్పనిసరిగా నామినీని ఎంచుకోవాలని సెబీ నిబంధనను తెచ్చింది. లేదంటే నామినీ వద్దంటూ డిక్లరేషన్‌ సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ నామినీని ఎంపిక చేసుకోక పోతే ఆ ఖాతాలు స్తంభించిపోతాయని తెలిపింది. దీంతో వాటి ప్రయోజనాలు పొందే అవకాశం కోల్పోతారు. ఇప్పటికే నామినీ వివరాలు నమోదు చేసుకున్నవారు తిరిగి నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు.

మరోవైపు డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాదారులకూ సెబీ ఊరటనిచ్చింది. నామినీ వివరాలను సమర్పించేందుకు మార్చి 31గా ఉన్న గడువును సెప్టెంబర్‌ 30 వరకు పొడిస్తున్నట్లు ప్రకటించింది. గడువు తేదీ సమీపించినప్పటికీ చాలామంది డీమ్యాట్‌, ట్రేడింగ్‌ ఖాతాదారులు నామినీ వివరాలను సమర్పించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని