‘మార్కెట్లో సంపద సృష్టికి ఆయనే నిదర్శనం’.. వృద్ధుడి వీడియో వైరల్‌

స్టాక్‌ మార్కెట్‌లో క్రమశిక్షణ కూడిన దీర్ఘకాలిక పెట్టుబడులతో సంపద సృష్టించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. తాజాగా ఈ నియమాన్ని పాటించిన వృద్ధుడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Published : 28 Sep 2023 17:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టాక్‌మార్కెట్‌లో దీర్ఘకాల పెట్టుబడులు లాభాలిస్తాయని చాలా మంది మార్కెట్‌ రంగ నిపుణులు సూచిస్తుంటారు. అలాగే, క్రమశిక్షణ, ఓపిక కూడా ఉండాలని చెబుతుంటారు. ఈ రెండు పద్ధతులు పాటించేవారు మార్కెట్‌ ద్వారా పెద్ద మొత్తంలో లాభాలు పొందుతారని మార్కెట్‌ నిపుణులు తరచుగా చెప్పే మాట. వారెన్‌ బఫెట్‌, రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా వంటి వారు సైతం ఇదే సూత్రాన్ని పాటించామని చెబుతారు. తాజాగా ఇదే నియమాన్ని పాటించిన ఓ వృద్ధుడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

రాజీవ్‌ మెహతా అనే ఆర్థిక నిపుణుడు ఈ వీడియోను తన ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో షేర్‌ చేశాడు. వీడియోలో వృద్ధుడు మాట్లాడుతూ.. తనకు ఎల్‌ అండ్‌ టీలో 27 వేల షేర్లు, అల్ట్రాటెక్‌లో 2,475 షేర్లు, కర్ణాటక బ్యాంకులో నాలుగు వేల షేర్లు ఉన్నాయని, ప్రతి ఏటా డివిడెండ్‌ రూపంలో రూ.ఆరు లక్షలు వస్తున్నట్లు చెబుతాడు. అయినప్పటికీ మీరు సాధారణ జీవితం గడుపుతున్నారని వీడియో తీస్తున్న వ్యక్తి అంటాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘క్రమశిక్షణ కూడిన పెట్టుబడికి, సంపద సృష్టికి ఈయన నిదర్శనం’, ‘పవర్‌ ఆఫ్‌ సింప్లిసిటీ అంటే ఇదే’,‘ మార్కెట్‌ పెట్టుబడులకు ఆయన ఎలాంటి ప్రణాళిక అనుసరిస్తున్నారో’ చెప్పాలంటూ కామెంట్లు పెడుతున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని