Renault- Nissan: భారత్‌లో రెనో-నిస్సాన్‌ 6 కొత్త కార్లు.. రూ.5300 కోట్ల పెట్టుబడులు

Renault- Nissan: భారత్‌లో సంయుక్తంగా ఆరు కొత్త కార్లను తీసుకురానున్నట్లు రెనో, నిస్సాన్‌ ప్రకటించాయి. మరోవైపు దేశంలో రూ.5300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి.

Updated : 13 Feb 2023 14:59 IST

చెన్నై: ప్రముఖ కార్ల తయారీ సంస్థలు రెనో (Renault), నిస్సాన్‌ (Nissan) కలిసి సంయుక్తంగా భారత్‌లో రూ.5,300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇందులో భాగంగా ఆరు కొత్త మోడల్‌ కార్లను దేశీయ విపణిలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించాయి. వీటిల్లో రెండు విద్యుత్తు వాహనాలు (Electric Vehicles). ఒక్కో కంపెనీ మూడు కార్లను తీసుకురానుంది. వీటన్నింటినీ ఒకే ప్లాట్‌ఫామ్‌పై తయారు చేయనున్నాయి. ప్రస్తుతం ఇరు కంపెనీలు కలిసి చెన్నైలోని తయారీ కేంద్రం నుంచి నాలుగు కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి.

మరోవైపు 2025 నాటికి చెన్నైలోని తయారీ కేంద్రాన్ని కర్బనరహితంగా మార్చనున్నట్లు నిస్సాన్‌ (Nissan) గ్లోబల్‌ సీఓఓ అశ్వినీ గుప్తా తెలిపారు. తాజా పెట్టుబడుల ద్వారా భారత్‌లో 2,000 కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. ఇరు కంపెనీలు గతవారమే తమ కార్ల తయారీ భాగస్వామ్యాన్ని లండన్‌లో పునఃసమీక్షించాయి. ఆ తర్వాత ప్రకటించిన తొలి ప్రణాళిక ఇదే కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని