Instant loan apps: తక్షణ రుణ యాప్‌లతో జాగ్రత్త.. భద్రత కోసం SBI చెప్పిన చిట్కాలు

అనుమానాస్పద మనీ లెండింగ్‌ యాప్‌లను గుర్తించినట్లయితే స్థానిక పోలీసు అదికారులకు నివేదించండి

Updated : 24 Nov 2022 20:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవలి కాలంలో ఫేక్‌ రుణ యాప్‌లు ఎక్కువైపోయాయి. ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకొని క్షణాల్లో రుణాలు అందిస్తూనే ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నాయి. రుణాలు చెల్లించడంలో విఫలమైన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నాయి. ఇలాంటి మోసపూరిత రుణ యాప్‌ల నుంచి దూరంగా ఉండడం అవసరం. ఈ నేపథ్యంలో దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. కస్టమర్లు ఇలాంటి రుణ యాప్‌ల వలలో చిక్కుకోకుండా అనుసరించాల్సిన కొన్ని భద్రతా నియమాలను తెలియజేసింది.

ఎస్‌బీఐ చెప్పిన భద్రతా చిట్కాలు..

  • యాప్‌ డౌన్‌లోడ్‌ చేసేందుకు ముందు యాప్‌ ప్రామాణికతను తనిఖీ చేయండి. 
  • అనుమానాస్పద లింక్‌లపై క్లిక్‌ చేయవద్దు.
  • అనధికార యాప్‌లను ఉపయోగించకపోవడం మంచిది. ఇవి మీ డేటాను దొంగిలించవచ్చు. 
  • యాప్‌ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇచ్చే అనుమతులను, సెట్టింగ్స్‌ను తనిఖీ చేయండి. ఇలా చేయడం వల్ల డేటాను సురక్షితం చేసుకోవచ్చు. 
  • అనుమానాస్పద మనీ లెండింగ్‌ యాప్‌లను గుర్తించినట్లయితే స్థానిక పోలీసు అదికారులకు నివేదించండి.

చట్టబద్ధమైన రుణాలు ఆర్‌బీఐ వద్ద నమోదు చేసుకున్న బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిస్తున్న సంస్థలు మాత్రమే అందించవచ్చు. నో యుర్‌ కస్టమర్‌(కేవైసీ) సంబంధిత పత్రాలను  గుర్తు తెలియని వ్యక్తులతో గానీ, ధ్రువీకరించని అనధికారిక యాప్‌ల వద్ద గానీ షేర్‌ చేయడం మంచిది కాదని గుర్తుంచుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని