IND vs NZ: డిస్నీ+ హాట్‌స్టార్‌ సరికొత్త రికార్డ్‌.. ఫైనల్‌లో పరిస్థితి ఏంటో!

Disney+ Hotstar: భారత్‌-న్యూజిలాండ్ మధ్య జరిగిన సెమీస్‌లో సరికొత్త వ్యూయర్‌షిప్‌ రికార్డు నమోదైంది. డిస్నీ+ హాట్‌స్టార్ వేదికగా ఓ దశలో 5.3 కోట్ల మంది ఈ మ్యాచ్‌ను వీక్షించారు.

Updated : 16 Nov 2023 13:37 IST

Disney+ Hotstar | ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) సరికొత్త రికార్డును నమోదు చేసింది. ముంబయిలోని వాంఖడే మైదానంలో జరిగిన భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య సెమీస్‌ మ్యాచ్‌ రికార్డు స్థాయిలో వ్యూయర్‌షిప్‌ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌ను ఓ దశలో 5.3 కోట్ల మంది వీక్షించారు. తొలుత భారత్‌ ఇన్నింగ్స్‌ను 5.1 కోట్ల మంది చూడగా.. న్యూజిలాండ్‌ లక్ష్య ఛేదనను అత్యధికంగా 5.3 కోట్ల మంది లైవ్‌లో వీక్షించారు.

ఐపీఎల్‌ విషయంలో జియో సినిమా అనుసరించిన వ్యహాన్నే డిస్నీ+ హాట్‌స్టార్‌ ఈ సారి అందిపుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రపంచకప్‌ మ్యాచ్‌లను ఉచితంగా ప్రసారం చేస్తోంది. దీంతో జియో సినిమా పేరిట ఉన్న రికార్డులను తిరగరాస్తోంది. ఐపీఎల్‌ చరిత్రలో చెన్నై, గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను 3.2 కోట్ల మంది లైవ్‌లో వీక్షించడం ఇప్పటి వరకు భారత్‌లో డిజిటల్‌ వేదికగా ఉన్న అత్యధిక వ్యూయర్‌షిప్‌ రికార్డ్‌. ఆ రికార్డును డిస్నీ+ హాట్‌స్టార్‌ అధిగమించింది. ప్రపంచకప్‌లో అక్టోబర్‌ 22న ఇండియా, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ను 3.5 కోట్ల మంది వీక్షణతో ఆ రికార్డును దాటేసింది. సెమీస్‌లో డిస్నీ+ హాట్‌స్టార్‌ తన రికార్డును తానే బద్దలుకొడుతూ సరికొత్త గణాంకాలు నమోదు చేసింది.

వాట్సప్‌ బ్యాకప్‌.. ఇక గూగుల్‌ అకౌంట్‌ స్టోరేజీ లిమిట్‌లోనే!

2019లో ప్రపంచకప్‌లోనూ భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ను డిస్నీ+హాట్‌స్టార్‌లో అత్యధికంగా 2.5 కోట్ల మంది లైవ్‌లో వీక్షించారు. ఉచిత ప్రసారాలకు తోడు డేటా సేవింగ్‌, మ్యాక్స్‌ వ్యూ ఆప్షన్‌ను తీసుకురావడం ఈసారి డిస్నీ+ హాట్‌స్టార్‌కు కలిసొచ్చింది. ఇక సెమీస్‌లోనే ఇలా ఉంటే.. ఫైనల్‌ మ్యాచ్‌ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఇప్పటికే భారత్‌ సగర్వంగా ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లలో ఒక దానితో భారత్‌ తలపడనుంది. ఫైనల్‌కు ఈ రెండింట్లో ఏ జట్టు వచ్చినా సరికొత్త వ్యూయర్‌షిప్‌ రికార్డు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది. నవంబర్‌ 19న ఆదివారం అహ్మదాబాద్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని