Stock Market: ఫ్లాట్‌గా కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market Opening Bell: దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు బుధవారం ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి.

Published : 13 Dec 2023 09:34 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ (Stock Market) సూచీలు బుధవారం స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు దేశీయంగా వెలువడనున్న ద్రవ్యోల్బణ గణాంకాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. దీంతో నేటి ట్రేడింగ్‌లో సూచీలు ఒడుదొడుకులకు గురవుతున్నాయి. ట్రేడింగ్ ఆరంభంలో స్వల్ప లాభాలతో ఉన్న సూచీలు.. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి.

ఉదయం 9.21 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ (Sensex) 100 పాయింట్ల నష్టంతో 69,450 వద్ద, నిఫ్టీ (Nifty) 25 పాయింట్ల నష్టంతో 20,881 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 83.38గా కొనసాగుతోంది. ఐషర్‌ మోటార్స్‌, ఎన్టీపీసీ, ఐటీసీ, భారత్‌ పెట్రోలియం, యూపీఎల్‌ లిమిటెడ్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. ఓఎన్జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఎస్‌అండ్‌పీ సూచీ 0.46శాతం, డోజోన్స్‌ 0.48శాతం, నాస్‌డాక్‌ 0.70శాతం మేర లాభపడ్డాయి. అటు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ సూచీ, జపాన్‌ నిక్కీ లాభాల్లో ఉండగా.. కొరియా, హాంకాంగ్‌ సూచీలు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని