Spicejet: స్పైస్‌జెట్‌ 18వ వార్షికోత్సవ ఆఫర్‌.. ₹ 1818 ధరకే విమాన టికెట్‌

స్పైస్‌జెట్‌ (Spicejet) 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తక్కువ ధరకే విమాన టికెట్‌ను బుక్ చేసుకునే సదపాయం అందిస్తోంది. దాంతోపాటు 18 ఏళ్లు వయస్సు వారికి ప్రత్యేక డిస్కౌంట్‌ కూపన్‌ను కూడా ఇస్తున్నట్లు తెలిపింది.

Published : 23 May 2023 19:09 IST

దిల్లీ: దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ (Spicejet) ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. సంస్థ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విమాన టికెట్ల (Flight Tickets)ను తక్కువ ధరకే అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్‌తో ప్యాసింజర్లు రూ.1,818 ధరకే విమాన టికెట్‌ కొనుగోలు చేయొచ్చని తెలిపింది. బెంగళూరు-గోవా, ముంబయి-గోవా నగరాల మధ్య ప్రయాణించే వారు మాత్రమే ఈ ఆఫర్‌ కింద తక్కువ ధరకు టికెట్‌లు బుక్‌ చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌ సేల్‌ 23 మే 2023 నుంచి 28 మే 2023 వరకు మాత్రమేనని తెలిపింది. టికెట్‌లు బుక్‌ చేసుకున్న వారు 1 జులై 2023 నుంచి 30 మార్చ్‌ 2024 వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. 

ఈ ఆఫర్‌తోపాటు స్పైస్‌జెట్‌ మరికొన్ని డిస్కౌంట్‌ కూపన్లు కూడా అందిస్తోంది. 2023లో 18 ఏళ్లు వయసు కలిగిన లేదా 18వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకునే ప్రయాణికులకు రూ. 3,000 విలువైన ఉచిత ఫ్లైట్‌ వోచర్‌ను ఇస్తోంది. ఈ కూపన్‌ కోసం జూన్‌ 10 తేదీలోపు స్పైస్‌జెట్‌కు తమ వివరాలను ఈ-మెయిల్‌ చేయాలి. తర్వాత 10 జులై వరకు కూపన్‌ పంపుతారు. దాన్ని ఉపయోగించి 31 ఆగస్టులోపు టికెట్‌ బుక్‌ చేసుకుని 30 సెప్టెంబరులోపు ప్రయాణించాలి. అయితే, టికెట్‌ బుకింగ్‌ విలువ రూ. 7,500 దాటిన వారికి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని స్పైస్‌జెట్ తెలిపింది. దాంతోపాటు స్పైస్‌మ్యాక్స్‌ ద్వారా టికెట్‌లు బుక్‌ చేసుకునే ప్రయాణికులకు 50 శాతం డిస్కౌంట్‌తోపాటు విమానంలో తమకు నచ్చిన సీటును కేవలం రూ. 18 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. స్పైస్‌జెట్‌ 23 మే 2005న దిల్లీ-అహ్మదాబాద్‌ మధ్య  తన తొలి విమాన సర్వీస్‌ను ప్రారంభించింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని