Electric Scrambler: ప్రపంచ తొలి ఎలక్ట్రిక్‌ ఆఫ్‌రోడ్‌ బైక్‌ ఇదే.. లుక్‌ అదిరిపోయిందిగా..!

న్యూజిలాండ్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ స్విచ్‌ ఇ-స్క్రాంబ్లర్‌ (ఆఫ్‌రోడ్‌ బై‌క్‌)ను ఆవిష్కరించింది.

Updated : 25 Jul 2022 19:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలకు పోటీగా ఇప్పటికే విద్యుత్‌ స్కూటర్లు, బైకులు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆఫ్‌లైన్‌ బైకుల విభాగంలో సైతం ఎలక్ట్రిక్‌ వాహన ప్రస్థానం మొదలైంది. న్యూజిలాండ్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ స్విచ్‌ దీన్ని తీసుకొచ్చింది. మట్టి రోడ్లు, ఇసుక తిన్నెలపై సునాయాసంగా నడిపేందుకు వీలుగా ఉండే ఇ-స్క్రాంబ్లర్‌ (ఆఫ్‌రోడ్‌ బై‌క్‌)ను ఆవిష్కరించింది. ప్రపంచ మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ స్క్రాంబ్లర్‌ మోటార్‌ సైకిల్‌ ఇదేనని కంపెనీ ఇదేనని కంపెనీ పేర్కొంది. తాజాగా ఈ బైక్‌ ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించింది. 2023 తొలి త్రైమాసికం నుంచి విక్రయాలు ప్రారంభించనుంది.

వాస్తవానికి ఈ కంపెనీ 2020లోనే ఈ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. అయితే, కొవిడ్‌ కారణంగా రెండేళ్ల పాటు దీనికి బ్రేక్‌ పడింది. స్క్రాంబ్లర్‌ విభాగంలో డుకాటి కంపెనీ గతంలో తీసుకొచ్చిన మోడల్‌ను పోలి ఉన్న ఈ బైక్‌.. అత్యాధునిక ఫీచర్లతో వస్తోంది. 170 కేజీల బరువు ఉండే ఈ బైక్ మోనో సస్పెన్షన్‌తో వస్తోంది. 13kWh బ్యాటరీని అమర్చారు. 50kW ఎయిర్‌కూల్డ్‌ మోటార్‌ కలిగిన ఈ మోటార్‌ సైకిల్‌ 70hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని, 3.5 సెకెన్ల సమయంలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని తెలిపింది. కేవలం 4 గంటల్లోనే 90 శాతం బ్యాటరీని ఛార్జ్‌ చేయొచ్చని కంపెనీ పేర్కొంది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది. బయటకు కనిపించకుండా ఎలక్ట్రిక్‌ పరికరాలు, కంట్రోల్స్‌ను ట్యాంక్‌ భాగంలో అమర్చారు. బైక్‌ ధరను 11,999 అమెరికన్‌ డాలర్లుగా నిర్ణయించింది. మన కరెన్సీ ప్రకారం దాదాపు రూ.10 లక్షలు. ప్రపంచవ్యాప్తంగా డెలివరీలు అందిస్తామని కంపెనీ చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు