UBI: రూ.లక్ష కోట్ల విలువ కలిగిన బ్యాంకుగా యూబీఐ

రూ.లక్ష కోట్ల విలువ కలిగిన నాలుగో ప్రభుత్వ రంగ బ్యాంకుగా ‘యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (UBI)’ రికార్డులకెక్కింది.

Updated : 16 Jan 2024 16:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం: భారతీయ స్టాక్‌ మార్కెట్‌ జోరు కొనసాగుతోంది. నేడు మార్కెట్‌ దిద్దుబాటుకు గురైనా కొన్ని షేర్లు లాభాలను సాధించాయి. ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు దూసుకుపోతున్నాయి. ఇప్పటివరకు ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లు రూ.1 లక్ష కోట్ల విలువ కలిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులుగా అవతరించగా.. తాజాగా ‘యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (UBI)’ నాలుగో బ్యాంకుగా రికార్డులకెక్కింది.

దాదాపు 50 శాతం పెరుగుదల

2023లో యూబీఐ స్టాక్‌ ధర దాదాపు 50 శాతం పెరగడంతో ఇన్వెస్టర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. ప్రతి త్రైమాసికానికి ఈ బ్యాంకు లాభాలను సాధిస్తోంది. ఉదాహరణకు 2023 జనవరిలో ఒకరు రూ.100 పెట్టుబడి పెడితే ఆ ఏడాది చివరకు 50 రూ.లాభంతో ఏకంగా 150 అయిఉండేది.

ఎఫ్‌డీ రేట్లను పెంచిన యూనియన్‌ బ్యాంక్‌

సుదీర్ఘకాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు అంత ప్రాధాన్యానికి నోచుకోలేదు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రికవరీ రేటు పెరగడంతో.. ఒక్కసారిగా అవి మదుపరుల దృష్టిలో పడ్డాయి. మూడేళ్లుగా ఈ స్టాక్‌ ఏకంగా 316.87 శాతం పెరగడం గమనార్హం. గత ఏడు రోజులుగా  10.58 శాతం పెరిగింది. ఇవే కాదు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ల లాభాలు పెరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని