FD Rates: ఎఫ్‌డీ రేట్లను పెంచిన యూనియన్‌ బ్యాంక్‌

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొన్ని కాలవ్యవధుల ఎఫ్‌డీలపై 25 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను పెంచింది.

Published : 27 Dec 2023 17:45 IST

దిల్లీ: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలపై 25 బేసిస్‌ పాయింట్ల (బీపీఎస్‌) వరకు వడ్డీ రేట్లను పెంచింది. ఏడాది నుంచి 398 రోజుల మధ్య కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 6.75 శాతానికి పెంచింది. 399 రోజుల కాలవ్యవధి ఎఫ్‌డీ రేట్లను 7% నుంచి 7.25 శాతానికి పెంచింది. 400 రోజుల నుంచి 3 ఏళ్ల కంటే తక్కువ కాలవ్యవధి ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 6.30% నుంచి 6.50% శాతానికి పెంచింది. సీనియర్‌ సిటిజన్లు సాధారణ డిపాజిటర్ల కంటే 0.50% అదనపు వడ్డీ రేటు పొందుతారు. సూపర్‌ సీనియర్‌ సిటిజన్స్‌ సాధారణ డిపాజిటర్ల కంటే 0.75% అదనపు వడ్డీ లభిస్తుంది. యూనియన్‌ బ్యాంకు వెబ్‌సైట్‌ ప్రకారం కొత్త వడ్డీ రేట్లు 2023 డిసెంబర్‌ 27 నుంచి అమల్లోకి వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని