Burj Khalifa: బుర్జ్‌ ఖలీఫాపై మెరిసిన మ్యాన్‌కైండ్‌ ఫార్మా

ప్రముఖ ఔషధ తయారీ సంస్థ మ్యాన్‌కైండ్‌ ఫార్మాకు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్‌ ఖలీఫా (Burj Khalifa)పై ఆ సంస్థ పేరును

Published : 20 Jul 2023 23:15 IST

దుబాయి: ప్రముఖ ఔషధ తయారీ సంస్థ మ్యాన్‌కైండ్‌ ఫార్మాకు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్‌ ఖలీఫా (Burj Khalifa)పై ఆ సంస్థ పేరును ప్రదర్శించారు. భారత కాలమానం ప్రకారం జులై 20న రాత్రి 9.45గంటలకు దుబాయిలోని ఈ ప్రఖ్యాత భవనంపై మ్యాన్‌కైండ్‌ ఫార్మా పేరును ప్రదర్శించారు. ఇది తమకు ఓ మరపురాని జ్ఞాపకంగా నిలిచిపోతుందని ఆ సంస్థ పేర్కొంది. మ్యాన్‌కైండ్ ఫార్మా, ఆ సంస్థ చేస్తోన్న కృషిని వివరించేలా ఐకానిక్ బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించినందుకు తామ ఎంతో ఆనందిస్తున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. ఫార్మా రంగంలో కృషిచేస్తోన్న మ్యాన్‌కైండ్‌ను ఎన్నడూలేని విధంగా బూర్జ్‌ ఖలీఫాపై ప్రదర్శించడంపై ఆ సంస్థ హర్షం వ్యక్తం చేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని